Friday, January 31, 2025
Homeతెలంగాణమనుషులు ఆరోగ్యంగా ఉంటే సమాజం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. మహేష్ కుమార్ గౌడ్

మనుషులు ఆరోగ్యంగా ఉంటే సమాజం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. మహేష్ కుమార్ గౌడ్

Listen to this article

పయనించే సూర్యుడు జనవరి 31 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి

మనుషులు ఆరోగ్యంగా ఉంటే సమాజం కూడా ఆరోగ్యంగా ఉంటుందని తద్వారా దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అన్నారు. బోరబండ మోతి నగర్ లో నూతనంగా నిర్మించిన 555 ఫిట్నెస్ సెంటర్ ను ఆయన కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ తో కలిసి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ మాట్లాడుతూ చిన్నప్పటి నుంచే ప్రతి వ్యక్తి శారీరక మానసిక దృఢత్వానికి కృషి చేయాలని సూచించారు. ఆటలు ఆడటం శారీరిక శ్రమ చేయడం ద్వారా మనిషి పూర్తిస్థాయి ఆరోగ్యం గా ఉంటాడని అన్నారు బండి రమేష్ మాట్లాడుతూ ప్రతి వ్యక్తి ఎవరికి వారు వ్యక్తిగత ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలన్నారు ఏ వయసు వారైనా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం ద్వారా జీవన కాలాన్ని పెంపొందించుకోవచ్చన్నారు. కార్యక్రమంలో నిర్వాహకులు వెంకటేష్ గౌడ్ తో పాటు హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్ బాబా, ఫసియుద్దీన్, కాంగ్రెస్ నాయకులు నవీన్ కుమార్, రఘు మరియు కాంగ్రెస్ యూత్ నాయకులు , సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments