షాద్ నగర్ బీఆర్ఎస్ యువ నాయకుడు వై. రవీందర్ యాదవ్
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నేటికీ 420 రోజులు పూర్తి
కాంగ్రెస్ 420 హామీలపై గాంధీ వర్ధంతి సాక్షిగా నిరసన
షాద్ నగర్ లో గాంధీ విగ్రహానికి నివాళులర్పించిన బీఆర్ఎస్ శ్రేణులు
గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి తప్పు చేశామని ప్రజలు బాధపడుతున్నారు
420 హామీలను వెంటనే నెరవేర్చాలని పెద్ద ఎత్తున నినాదాలు
( పయనించే సూర్యుడు జనవరి 30 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జి మేఘవత్ నరేందర్ నాయక్)
మహాత్మ కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి మంచి ఆలోచన ప్రసాదించి వారిచ్చిన 420 హామీలను వెంటనే నెరవేర్చే విధంగా బుద్ధి ప్రసాదించాలని షాద్ నగర్ నియోజకవర్గ భారత రాష్ట్ర సమితి యువ నాయకుడు వై. రవీందర్ యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గాంధీ వర్ధంతి సందర్భంగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని గంజ్ మహాత్మా గాంధీ విగ్రహానికి గురువారం బీఆర్ఎస్వీ షాద్ నగర్ నియోజకవర్గ అధ్యక్షుడు శీలం శ్రీకాంత్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు వర్ధంతి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమానికి షాద్ నగర్ పట్టణ మాజీ మున్సిపల్ చైర్మన్ కే నరేందర్, వైస్ చైర్మన్ ఎంఎస్ నటరాజన్, సీనియర్ నాయకులు కడెంపల్లి శ్రీనివాస్ గౌడ్, మాజీ రైతు సమితి అధ్యక్షుడు తాండ్ర వెంకట్ రెడ్డి, రాయికల్ వెంకట్ రెడ్డి తదితరులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి నేటికీ 420 రోజులు అయిన సందర్భంగా అధిష్టానం రూపొందించిన 420 హామీలు అంటూ ఒక బుక్ లెట్ ను ప్రదర్శించారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 420 రోజులు అయ్యిందని మహాత్మా గాంధీ పేరు చెప్పుకొని రాజకీయం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి బుద్ధి ప్రసాదించాలని ఈ సందర్భంగా విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేశామా అని ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారని రవి యాదవ్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందుకు చాలా పాపం చేశామని ప్రాయశ్చిత్తం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఎన్నో పథకాలు ప్రకటించి వాటిని అమలు చేయలేకపోయారని విమర్శించారు. లక్ష రూపాయలు తులం బంగారం ఏమైందని ప్రశ్నించారు. వితంతువులకు, వృద్ధులకు ఇతరులకు పింఛన్లు పెంచారా అని నిలదీశారు..? రైతుబంధు ఇప్పటికీ రెండు సార్లు డుమ్మా కొట్టారని వివరించారు. 12 వేల జీవనభృతి ఎన్నో హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని అన్నారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అడిగేందుకు కూడా ఇప్పుడు సిద్ధంగా లేరని ఎన్నికల్లో ఎప్పుడైతే కాంగ్రెస్ నాయకులు గ్రామాలకు వస్తారు అప్పుడే కరువు కాల్చి వాత పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని రవీందర్ యాదవ్ స్పష్టం చేశారు. బాధ్యతా యుతమైన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీని సంక్షేమ పథకాల అమలు కోరుతున్నామని కాంగ్రెస్ పార్టీ మారితే వచ్చేసారి కూడా అధికారం వారికి వస్తుందని ఇందులో తాము స్వార్థం కోరుకోవడం లేదని, తాము ప్రజలకు మాత్రం మంచి జరగాలని కోరుకుంటున్నామని స్పష్టం చేశారు. గతంలో తాము చేసిన మంచి పనులకు రెండవసారి కూడా ప్రజల ఆశీర్వాదంతో గెలుపొందామని గుర్తు చేశారు. అలా ప్రజలకు మంచి చేసి మీరు కూడా మార్పు చెందాలని ఆశించారు. ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేయాలన్నదే తమ డిమాండ్ అని చెప్పారు. ఇచ్చిన ప్రతి హామీకి గాంధీ పేరు చెప్పుకొని రాజకీయం చేశారని ఇప్పుడు ఆ గాంధీ సాక్షిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి 420 రోజులు అయ్యిందని అందుకే వారిచ్చిన 420 హామీలు కూడా వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ ఎమ్మెస్ నటరాజన్, సీనియర్ నాయకులు కడెంపల్లి శ్రీనివాస్ గౌడ్, తాండ్ర వెంకట్ రెడ్డి, లక్ష్మణ్ నాయక్, వీరేశం, సుధీర్, రఘునాథ్ యాదవ్, ఒగ్గు కిషోర్, బీశ్వ రామకృష్ణ, వెంకట్ రెడ్డి, మహమ్మద్ ఎజాజ్ (అడ్డు), జూపల్లి శంకర్, నందారం అశోక్ యాదవ్, జూపల్లి శంకర్, ఈగ వెంకట్రాంరెడ్డి, ప్రతాప్ రెడ్డి, నందకిషోర్, మన్నె నారాయణ, లంకాల రాఘవేందర్ రెడ్డి, సలీం, భిక్షపతి, గుండు అశోక్, కొండ మల్లేష్, గుడ్డు యాదవ్, కంది రాఘవేందర్ గౌడ్, శరత్ కృష్ణ, బాలరాజు, బుగ్గకృష్ణ, కిరణ్, శీలం శ్రీకాంత్, రాజశేఖర్, పులిజాల నవీన్, తుప్పుడు నరసింహా, ధీమ గణేష్, సంజయ్, ఎస్పీ శివ, నరేష్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.