
పయనం చే సూర్యుడు న్యూస్ జనవరి నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్
తెలంగాణ నిజాంబాద్ జిల్లా లో – నూడ చైర్మన్ కేశ వేణు
భారత జాతిపిత మహాత్మా గాంధీ గారి 77వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ భవన్ నందు నిజామాబాద్ నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశ వేణు ఆధ్వర్యంలో గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం గాంధీ చౌక్ వద్ద గల గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా కేశ వేణు మాట్లాడుతూ భారత దేశానికి స్వాతంత్ర్యం తేవడంలో మహాత్మా గాంధీ పాత్ర ఎంతో కీలకమని,శాంతియుతంగా ప్రేమను అందిస్తూనే దేశానికి స్వాతంత్ర్యం తీసుకు వచ్చిన మహోన్నత వ్యక్తి మహాత్మా గాంధీ అని ఆయన అన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించి దేశ పౌరులకు ఆదర్శంగా నిలిచిన మహాత్మా గాంధీ జీవిత చరిత్రను కనుమరుగు చేసే విధంగా ప్రస్తుతం దేశంలో బిజెపి ప్రభుత్వం చూస్తుందని, పిల్లలు చదువుకునే పుస్తకాల నుండి మహాత్మా గాంధీ జీవిత చరిత్ర ను తీసేసి ప్రయత్నం చేస్తున్నారని కానీ మహాత్మా గాంధీ జీవితం పిల్లలు ఎంతో స్ఫూర్తిదాయకం అని ఆయన అన్నారు. ఆర్ఎస్ఎస్ బావజాలాలు కలిగిన గాడ్సే మహాత్మా గాంధీ గారిని చంపితే అదే ఆర్ఎస్ఎస్ భావజాలాలను కలిగిన బిజెపి గాడ్సేను గొప్ప వ్యక్తిగా చిత్రీకరిస్తూ మహాత్మా గాంధీ కీర్తిని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని కానీ ఆకాశం పై ఉమ్మివేస్తే అది వారిపైనే పడుతుంది అని బిజెపి నాయకులు గుర్తుంచుకోవాలని, మహాత్మా గాంధీ ఆలోచనలు సేవలు ఆయన చేసిన మంచి పనులు ఎన్నటికీ దేశ ప్రజలు మరిచిపోరని దేశ యువకులు మహాత్మా గాంధీ ఆలోచనలను అందిపుచ్చుకొని ముందుకు వెళ్లాలని, మహాత్మా గాంధీ కి మరొకసారి కేశవ వేణు నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షులు వేణు రాజ్, జిల్లా సేవదళ అధ్యక్షులు సంతోష్, జిల్లా ఫిషర్మెన్ చైర్మన్ శ్రీనివాస్ ,మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఈసా, నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రేవతి, నగర ఎస్టీ అధ్యక్షులు జాదవ్, రాష్ట్ర ఎస్సీ సెల్ కన్వీనర్ సాయిలు, అవీన్,మహిళా కాంగ్రెస్ నాయకులు పోల ఉష, గాజుల సుజాత, మలైకా బేగం, లవంగ ప్రమోద్, ఆకుల మహేందర్,కోనేరు విజయలక్ష్మి, ఆశబీ, ఆడే ప్రవీణ్ కుమార్,అపర్ణ,విజయ రాణి, ముశ్షు పటేల్ మరియు తదితరులు పాల్గొన్నారు