
పయనించే సూర్యుడు బాపట్ల జనవరి 30:- రిపోర్టర్ (కే. శివకృష్ణ)
బాపట్ల పురపాలక సంఘం,
మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా పురపాలక సంఘ కార్యాలయము నందు మునిసిపల్ కమిషనర్ జి. రఘునాథ రెడ్డి పూలమాలతో చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. కమిషనర్ గారు మాట్లాడుతూ సత్యం, అహింసలే ఆయుధాలుగా దేశానికి స్వాతంత్య్రం సముపార్జించిన జాతిపిత మహాత్మాగాంధీ అని అభివర్ణించారు.అహింస అనే ఆయుధంతో సూర్యుడు అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి దాస్యశృంఖలాల నుంచి భరతమాతకు విముక్తి కలిగించిన మహోన్నతుడు మహాత్మాగాంధీ అని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘ సిబ్బంది, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.