
పయనించే సూర్యడు న్యూస్.
కొయ్యురు : ఫిబ్రవరి న్యూస్
రిపోర్టర్ 🙁 చల్లంగి వినోద్ )
14 ఏళ్ల పసి ప్రాయం, దురదృష్ట వశాత్తు అతి చిన్న వయస్సు లోనే తల్లీదండ్రులు దూరం అవ్వడం, కడు పేదరికం, చిన్నాచితక పనులు చేసుకుంటూ ఆ చిన్నారి మేనమామ గోకిరి. శ్రీను పెంపకలో అతి బాధాకరమైన మనుగడ సాగిస్తున్న ఆ పసి ప్రాణానికి తన జీవితం అత్యంత కఠినమైన పరీక్ష పెట్టింది…. ఆ పసి ప్రాణానికి ప్రణాంతక రక్త కాన్సర్ సోకి…. నాకు బ్రతకాలి అనుంది…. నన్ను బ్రతికించండి అంటూ…ఆర్ధిస్తున్న తీరును అక్కడి వారిని తీవ్రంగా కలచివేసింది వివరాలలోకి వెళితే….అల్లూరి జిల్లా, కొయ్యురు మండలం, రాజేంద్ర పాలెం గ్రామానికి చెందిన “గోకిరి. శ్యాంప్రకాష్” వయస్సు 14 సంవత్సరాలు ఈ బాలుడు గత 2-3 సంవత్సరాలు గా బ్లడ్ క్యాన్సర్ కి గురి అయ్యాడు ఈ బాలుడుకి విశాఖపట్నం హాస్పిటల్ నందు ఆపరేషన్ నిర్వహించాలని, ఆపరేషన్ కి 18 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యలు తెలిపి నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.ఈ విషయం తెలుసుకున్న కొయ్యురు పరిసర దాతలు మరియు పత్రికా మిత్రులు ఆర్ధిక సహాయం అందించగా… నాకు ఆర్ధిక సహాయం వద్దు నన్ను బ్రతికించండి అంటూ ఆర్ధించిన తీరును చూసి ఇక్కడి వారు తీవ్ర దిగ్బ్రాంతికి గురైయ్యారు. ఈ క్రమంలో పత్రికా మిత్రులు అలాగే ప్రజా ప్రతినిధులు కలసి ఆ బాలుడికి వైద్య సహాయం కోసం నిశ్చయించే లోపే ఆ చిన్నారి మృత్యు వడిలోకి చేరుకోడం తో ఈ ప్రాంత ప్రజలు తీవ్ర విచారం వ్యక్తం చేసారు. ఈ విషయం అనోటా ఈనోటా జిల్లా అంతా వ్యాపించడం తో ఆ చిన్నారి ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నాడనే విషయం బయటకు రాగానే అధికారులు గానీ, ప్రజా ప్రతినిధులు గాని ఆ బాలునికి వైద్య సహాయం అందించినట్లయితే ఆ చిన్నారి బ్రతికేవాడని అనుకుంటున్నారు.