మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా తండాలో ప్రత్యేక పూజలు హనుమాన్ దేవాలయం చుట్టూ బండ్ల ప్రదర్శన మాజీ సర్పంచ్ సుమిత చందు నాయక్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు
( పయనించే సూర్యుడు జనవరి 14 షాద్నగర్ రిపోర్టర్ రవీందర్ ) షాద్ నగర్ యువత క్రీడలతో పాటు చదువులో రాణించేందుకు కృషి చేయాలని ఉప్పరిగడ్డ మాజీ సర్పంచ్ సుమిత చందు నాయక్ కోరారు. మంగళవారం ఫరూక్ నగర్ మండల పరిధిలోని ఉప్పరిగడ్డలో మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని వాలీబాల్ టోర్నమెంటును ప్రారంభించారు. అదేవిధంగా గ్రామంలోని హనుమాన్ దేవాలయం చుట్టూ ఎద్దుల బండ్ల ప్రదర్శన నిర్వహించారు. గ్రామంలో ఉన్న బొడ్రాయి కి ప్రత్యేక పూజలు చేశారు. మకర సంక్రాంతి పర్వదినాలు పురస్కరించుకొని ప్రతి ఏడాది గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించడంతోపాటు మైసమ్మ తల్లికి బోనాలను నైవేద్యంగా అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ సుమితా చందు నాయక్ మాట్లాడుతూ యువత చెడు అలవాట్లకు బానిసలు కాకుండా చదువుపై దృష్టి కేంద్రీకరించడంతోపాటు క్రీడల్లో రాణిస్తూ గ్రామానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని సూచించారు. క్రీడల్లో గెలుపు ఓటములు సమానంగా భావిస్తూ ముందుకు సాగినప్పుడే విజయాలను అందుపుచ్చుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని గ్రామదేవతలకు పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. ముందుగా మైసమ్మ తల్లికి బోనాలను ఊరేగింపుగా తీసుకువెళ్లి అమ్మవారికి నైవేద్యం సమర్పించడం జరిగిందని వివరించారు. గ్రామంలోని హనుమాన్ దేవాలయం చుట్టూ ఎద్దుల బండ్ల ప్రదర్శన చేయడంతో పాటు బొడ్రాయి కి ప్రత్యేక పూజలు చేసి గ్రామ దేవతల ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు. ఉప్పరిగడ్డ గ్రామపంచాయతీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఏ సమస్య ఉన్న తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఇందుకు గ్రామ ప్రజలతోపాటు యువత తనకు సహకరించేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తిరుపతయ్య, గజేందర్, బొజ్జ, ఈర్ల యాదయ్య, ఈర్ల శ్రీను, నందకుమార్, తిక్కన్న, రాజు లతోపాటు తండావాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.