Thursday, April 3, 2025
Homeతెలంగాణరంజాన్ మాసంలో ఆఖరి శుక్రవారం కావడంతో నేడు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

రంజాన్ మాసంలో ఆఖరి శుక్రవారం కావడంతో నేడు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

Listen to this article

పయనించే సూర్యుడు మార్చి 28 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి :తెలంగాణ రాష్ట్రంలో ప‌విత్ర‌ రంజాన్ మాసంలో ఆఖ‌రి శుక్ర‌వారం కావ‌డంతో చార్మినార్ వ‌ద్ద ఉన్న మ‌క్కా మ‌సీదులో ముస్లింలు సోద‌ రులు ప్ర‌త్యేక ప్రార్థ‌న‌ల‌కు భారీ సంఖ్య‌లో హాజ‌ర‌వు తారు. చార్మినార్ నుంచి మ‌దీనా వ‌ర‌కు ముస్లింలు ప్రార్థ‌న కార్య‌క్ర‌మాల్లో పా ల్గొంటారు. ఈ నేప‌థ్యంలో పోలీసులు న‌గ‌రంలో ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించారు.ఈ క్ర‌మంలో చార్మినార్, మ‌దీనా, శాలిబండ ప‌రిస‌ర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించారు. శుక్ర‌వారం ఉద‌యం ఎనిమిది గంట‌ల నుంచి సాయంత్రం నాలుగు గంట‌ల వ‌ర‌కు ట్రాఫిక్ ఆంక్ష‌లు అమ‌ల్లో ఉంటాయ‌ని పోలీసులు వెల్ల‌డించారు. చార్మినార్ ప‌రిస‌ర ప్రాంతాల‌కు వ‌చ్చే రోడ్ల‌న్నింటినీ ఉద‌యం ఎనిమిది గంట‌ల నుంచి సాయంత్రం నాలుగు గంట‌ల వ‌ర‌కు మూసేస్తున్నారు.చౌక్ మైదాన్ నుంచి చార్మినార్ వైపున‌కు వ‌చ్చే వాహ‌నాల‌ను కోట్ల అలిజా లేదా మొఘ‌ల్‌పురా వ‌ద్ద మ‌ళ్లించ‌నున్నారు.ఈతేబ‌ర్ చౌక్ ప‌రిస‌ర ప్రాంతాల నుంచి గుల్జార్ హౌజ్‌కు వ‌చ్చే వాహ‌నా లను మండి మీరాలం మార్కెట్ లేదా బీబీ బ‌జార్ వైపు మ‌ళ్లించ‌నున్నారు.నాగుల్‌చింత‌, శాలిబండ వైపు నుంచి చార్మినార్ వ‌చ్చే వాహ‌నాల‌ను హిమ్మ‌త్‌పురా జంక్ష‌న్ వ‌ద్ద మ‌ళ్లించి హ‌రిబౌలి, వోల్గా హోట‌ల్ టీ జంక్ష‌న్ వైపు మ‌ళ్లించ‌నున్నారు.మూసాబౌలి నుంచి చార్మినార్ వైపున‌కు వ‌చ్చే వాహ‌నాల‌ను మోతిగ‌ల్లీ వ‌ద్ద మ‌ళ్లించి ఖిలావ‌త్ గ్రౌండ్, రాజేశ్ మెడిక‌ల్ హాల్, ఫ‌తే ద‌ర్వాజా రోడ్డు వైపు మ‌ళ్లించ‌నున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments