పయనించే సూర్యుడు, ఫిబ్రవరి 1, ఆదోని రూరల్ రిపోర్టర్ : నిన్న మున్సిపల్ కౌన్సిల్ హాల్ లో జరిగిన సమావేశంలో కౌన్సిలర్లు రఘునాథ్ రెడ్డి మరియు నరసింహులు మాట్లాడిన తీరును ఆదోని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది.ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో బిజెపి జిల్లా అధికార ప్రతినిధి ఆదూరి విజయ్ కృష్ణ మాట్లాడుతూ సాటి కౌన్సిలర్ అందులో మహిళా కౌన్సిలర్ అయినటువంటి లలితమ్మను ఏక వచనంతో మాట్లాడుతూ రాజీనామా చేయాలని, బయటకు వెళ్లిపొమ్మని, అర్థరహితమైన వ్యాఖ్యలు చేశారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల పబ్లిక్ మీటింగ్ లో సాయి ప్రసాద్ రెడ్డి ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పిన మాటలను గుర్తు చేశారు, సాయి ప్రసాద్ రెడ్డి రాజకీయంగా దూరంగా ఉంటానని తాను చెప్పిన మాట మీద నిలబడి ప్రజలకు ప్రకటిస్తే అదే రోజు లలితమ్మ రాజీనామా చేస్తారని తెలిపారు. భూ కబ్జాలను ఆదోనిలో అడ్డగా మార్చింది వైసిపి పార్టీనే అని గుర్తు చేశారు, ఆదోని శాసనసభ్యులు పార్థసారధి నాయకత్వంలో ఆదోని అత్యంత అద్భుతంగా అభివృద్ధి అవుతుందని తెలిపారు, రిజిస్టార్ కార్యాలయంలో లంచాలు లేకుండా చేసిన ఘనత పార్థసారధి అని తెలిపారు. అనవసరంగా అసత్యపు ప్రచారాలు మానుకోవాలని రఘునాథ్ రెడ్డికి హితవు పలికారు.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు రమాకాంత్, శ్రీనివాసాచారి, సాయి ప్రసాద్ వాల్మీకి, ఫర్టిలైజర్ వీరేష్, ఉషా రాజు, కౌన్సిలర్ సురేష్, చంద్ర, ఉల్లిద్ర మోహన్, లక్ష్మీనారాయణ, అంజయ్ కుమార్, శ్రీకాంత్, నరసింహులు, బాలముని తదితరులు పాల్గొన్నారు.
రాజీనామాలు తర్వాత రాజకీయ సన్యాసం ఎప్పుడు చేస్తావో చెప్పు : ఆదూరి విజయ్ కృష్ణ
RELATED ARTICLES