
- 15 లక్షల విరాళాన్ని ప్రకటించిన ఎన్ఆర్ఐ
- గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ఎన్ఆర్ఐ విరాళం
పయనించే సూర్యుడు,ఫిబ్రవరి 4, అశ్వాపురం:
మొండికుంటలో రామాలయ నిర్మాణం గురించి తెలియగానే విశాలమైన మనసుతో సువిశాల మండప నిర్మాణానికి 10 లక్షల రూపాయలు ఇచ్చి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. తను చదువుకున్న బడికోసం, ఊరి ఆసుపత్రి కోసం, వృద్ధాశ్రమం కోసం, వైకుంఠదామం, పంచాయితీ భవనం వద్ద ప్రతిష్టించిన విగ్రహాల కోసం తన వంతు సహాయాలు అందించి ఊరు పై తనకున్న ప్రేమను చూపారు. ఇపుడు ఆర్థిక పరమైన ఇబ్బందుల వల్ల గుడి ప్రతిష్టాపన కార్యక్రమం కొంత ఆలస్యం అవుతుందని తెలుసుకొని ప్రతిష్టాపన మహోత్సవాన్ని నిర్వహించే బాధ్యతను, భారాన్ని భుజానికి ఎత్తుకున్నారు.యాగశాల నిర్మాణం, వేద పండితులు నిర్వహించే యజ్ఞ యాగాదులు, ధ్వజస్తంభ ప్రతిష్ట, శ్రీ సీతారాముల వారి మహా ప్రతిష్టాపన, మహా అన్నదానం ఇలా 5 రోజుల పాటు జరిగే అన్ని కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలంటే దాదాపు 15 లక్షల రూపాయల వరకు నిధులు అవసరం. ఇంత భారీ మొత్తం వెచ్చించి ఈ క్రతువు పూర్తిచేసేందుకు, ఊరంతా పండుగ చేసేందుకు నేను ఉన్నానంటూ మళ్లీ ముందుకు వచ్చారు సత్యనారాయణ రెడ్డి తన నిర్ణయాన్ని మంగళవారం మొండికుంటలోని రామాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆలయ కమిటీ నిర్వహించిన అత్యవసర సమావేశంలో ఆయన ప్రకటించారు.గుడి నిర్మాణానికి, ప్రతిష్టాపన మహోత్సవానికి మూడింట ఒక వంతు నిధులు తనే ఇస్తూ ఈ మహత్కార్యం నిర్వహించ తలపెట్టిన ఆయనకు ధన్యవాదములు. అతి త్వరలో మన ఊర్లో శ్రీ సీతారాముల ప్రతిష్టాపన పండుగ చేసేందుకు నడుం బిగించిన ఆ శ్రీమంతుడి సంకల్పానికి మొండికుంట గ్రామం తరపున ఆ గ్రామ ప్రజలు సత్యనారాయణ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.