
అబార్షన్ లు చేస్తే కఠిన చర్యలు కలెక్టర్ పమేలా సత్పతి..
పయనించే సూర్యడు //జనవరి //17//హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ //కుమార్ యాదవ్..
మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సింగాపూర్ గ్రామ ప్రాథమిక పాఠశాలలో సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి హాజరై మాట్లాడారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ… ఎవరైనా లింగ నిర్ధారణ పరీక్షలు, నిబంధనలకు విరుద్ధమైన అబార్షన్లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ప్రభుత్వ నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి అని తెలిపారు.అంగన్వాడీ కేంద్రాల్లో ఆటపాటలతో పూర్వ ప్రాథమిక విద్యను బోధిస్తున్నామని.. చిన్నారులను కేంద్రాలకు పంపించాలని తల్లులకు సూచించారు. తమతో పాటు కుటుంబసభ్యుల ఆరోగ్యంపై దృష్టి సారించాలని మహిళలకు సూచించారు.గర్భిణీగా నిర్ధారణ అయినప్పటి నుంచి మొదటి వెయ్యి రోజులు కీలకమని.. ఈ సమయంలో తీసుకున్న పౌష్టికాహారంతో పుట్టిన చిన్నారుల్లో సరైన మానసిక, శారీరక ఎదుగుదల ఉంటుందన్నారు.గర్భిణీ విధిగా నాలుగు ఏఎంసీ చెకప్ లు, ఐదు నెలలు దాటిన తర్వాత టిఫా స్కాన్ చేయించుకోవాలన్నారు.చెల్పూర్ సెక్టార్ పరిధిలో కొంత మంది చిన్నారులు పోషకాహార లోపంతో ఉన్నారని, వారి ఎత్తు, బరువు వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేస్తూ తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వాలని ఐసిడిఎస్, ఆరోగ్యశాఖ అధికారులకు సూచించారు.అంగన్వాడీ కేంద్రాల్లో అందించే ఆహారం ఇళ్లకు తీసుకెళ్లకుండా అక్కడే తినాలని లబ్ధిదారులకు విజ్ఞప్తి చేశారు.పిల్లలకు షుగర్ ఉన్న ప్రాసెస్డ్ ఫుడ్ పెట్టి.. వారిని బలహీనంగా మార్చవద్ధని అన్నారు.శుక్రవారం సభకు మహిళలు వస్తే అన్ని విషయాలపై అవగాహన కలుగుతుందన్నారు.ఆరోగ్య మహిళ కింద రూ. 40 వేల విలువైన 54 రకాల వైద్య పరీక్షలను ఉచితంగా అందిస్తున్నామని.. మహిళలు విధిగా ఆరు నెలలకోసారి సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేసుకోవాలని సూచించారు. క్యాన్సర్ వంటి వ్యాధులను ప్రాథమిక దశలో గుర్తిస్తే నయం చేయవచ్చన్నారు.జిల్లా సంక్షేమ అధికారి సబిత మాట్లాడుతూ..ఇంద్రధనస్సులో ఏడు రంగుల మాదిరి మన ప్లేట్లో ఏడు రకాల ఆహార పదార్థాలు ఉండేలా చూసుకోవాలన్నారు.ఈ సందర్భంగా పోషకాహార పదార్థాలు ప్రదర్శించారు. వైద్య శిబిరం ఏర్పాటు చేసి పలువురికి వైద్య పరీక్షలు చేసి మందులు అందించారు. అనంతరం గర్భిణులకు సీమంతం, చిన్నారులకు అన్నప్రాసన నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో కలెక్టర్,డీడబ్ల్యుఓ మొక్కలు నాటారు.ఈ కార్యక్రమంలో హుజురాబాద్ ఆర్డీవో రమేష్ బాబు, డీఎంహెచ్ఓ వెంకటరమణ, తహసీల్దార్ కనకయ్య, ఎంపీడీవో సునీత తదితరులు పాల్గొన్నారు.