Thursday, January 30, 2025
Homeఆంధ్రప్రదేశ్లోక కళ్యాణం కొరకై రుద్ర సహిత శత చండీయాగం

లోక కళ్యాణం కొరకై రుద్ర సహిత శత చండీయాగం

Listen to this article

శ్రీకాంతగిరి శ్రీమాతా క్షేత్రంలో రుద్ర సహిత శత చండీయాగ మహోత్సవం

పాల్గొన్న మాజీ మంత్రులు ఎమ్మెల్యే లు హరీష్ రావు, సబితా ఇంద్రా రెడ్డి, మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్

శత చండీయాగంలో ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి దంపతులు

( పయనించే సూర్యుడు జనవరి 27 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ మేఘావాత్ నరేందర్ నాయక్ )

పూర్వకాలము నుంచి మన భారత దేశం యజ్ఞ యాగాదులకు పుట్టినిల్లు లాంటిది. ప్రజల శ్రేయస్సు కోరి, ప్రజా సంక్షేమాన్ని అభివృద్ధి చేయడానికి రాజులు మహారాజులు ఎందరో ఎన్నో రకాల యజ్ఞాలు యాగాలు చేసినట్టు మనం పురాతన గాథల్లో చదువుతూనే ఉన్నాం. ప్రజలు పీడిత పరిస్థితులలో ఉన్నప్పుడు, ప్రజా సంక్షేమం సరిగ్గా లేనప్పుడు, ప్రజలు బాధావస్థలలో ఉన్నప్పుడు ప్రజల సంక్షేమం కోసం ఆ భగవంతున్ని తృప్తి పరచడం కోసం యజ్ఞ యాగాది క్రతువులు, వేదమంత్రోచ్చరణాల మధ్య చేయడం మన భారతీయ సంస్కృతి. ఇంతకుముందు కూడా చూస్తే తెలంగాణ పోరాటం చేసి తెలంగాణను సాధించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా రాష్ట్ర ప్రజలందరి అభ్యున్నతి కోసం ఇలాంటి యాగాలే చేశారు అని హరీష్ రావు గారు అన్నారు. అలాగే రంగారెడ్డి జిల్లా, కందుకూర్ మండలం, దాసర్లపల్లి గ్రామం శ్రీకాంతగిరి శ్రీమాతాక్షేత్రంలో శ్రీ రుద్ర సహిత శత చండీయాగ మహోత్సవం 108 గుండాలతో నిర్వహించారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలను తీర్చుతూ ప్రజల అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ, ఎక్కడ దేవాలయాలు నిర్మించిన తన వంతుగా భారీ విరాళాలు ప్రకటిస్తూ ప్రజల మనిషిగా పేరు ఉన్న ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి సతీ సమేతంగా రుద్ర సహిత శత చండీయాగం లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరితోపాటు, నియోజకవర్గ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, సుఖశాంతులతో ఉండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ యాగ కార్యక్రమంలో మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు హరీష్ రావు, సబితా ఇంద్రా రెడ్డి, మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మాజీ, షాద్ నగర్ మాజీ భార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్మోహన్ రెడ్డి, మరియు ప్రజా ప్రతినిధులు బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments