
పయనించే సూర్యుడు నంద్యాల జిల్లా రిపోర్టరు జి.పెద్దన్న
“”గాంధీజీ చూపించిన బాటలో నేడు ప్రపంచమంతా నడుస్తుండడం భారతీయులుగా మనకు గర్వకారణం అని నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ అన్నారు. ఈ సందర్భంగా స్థానిక గాంధీ చౌక్ నందుగల గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ గాంధీజీ ఆశయాలను ఆచరణలో పెడుతున్న ప్రభుత్వ కూటమి ప్రభుత్వం అన్నారు . ప్రపంచ చరిత్రను పరిశీలిస్తే అహింసా మార్గంలో పోరాటం చేసి విజయం సాదించినది ఒక్క భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమము మాత్రమేనని దానికి కారణం మహాత్మా గాంధీ అన్నారు . మహాత్మా గాంధీ అహింసా మార్గంలో శాంతియుతంగా దేనినైనా సాధించ వచ్చని ప్రపంచానికి చాటి చెప్పారని ఈరోజు ప్రపంచమంతా ఆయన చూపిన బాటలో నడుస్తుండడం భారతీయులుగా మనందరికీ గర్వకారణం అన్నారు . గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని భావించి గ్రామ స్వరాజ్యం కోసం గాంధీ కలలు గన్నారని గ్రామాలలో పెద్ద ఎత్తున సిమెంటు రోడ్లు నిర్మించడం తో పాటు గ్రామాలలో మౌలిక వసతులు కల్పించి తెలుగుదేశం ప్రభుత్వం గాంధీ కన్న కలలను నిజం చేసిందని చెప్పారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మహాత్మా గాంధీజీ ఆశయాలను ఆచరణలో పెడుతుందని బాపూజీ మహాత్మా గాంధీ వర్దంతి సందర్భంగా మన మందరం ఆయన ఈ దేశానికి , ప్రపంచానికి చేసిన సేవలు గుర్తు చేసుకుంటూ ఆయన చూపిన బాటలో నడుస్తూ ఆయన ఆశయ సాధనకు కృషి చేద్దామన్నారు.
నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా గాంధీ వర్ధంతి వేడుకలు
నంద్యాల స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం (రాజ్ టాకీస్) నందు ఘనంగా మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర పార్టీ కార్యదర్శి , నంద్యాల టిడిపి అబ్జర్వర్ పోతురాజు రవికుమార్ పాల్గొని మహాత్మ గాంధీ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సుధాకర్ , రవి , తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు