
పయనించే సూర్యుడు, జనవరి 29,బూర్గంపాడు మండల రిపోర్టర్ పోతుగంటి రామ్ ప్రసాద్:- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక సాకేతపురి ఆంజనేయ స్వామి ఆలయంలో దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవంనకు భక్తులచే గోటి తలంబ్రాలు ఒలిచే కార్యక్రమము బుధవారం మౌని అమావాస్య సందర్భంగా ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు సాకేతపురి ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో ధర్మ జాగరణ సమితి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ,మరియు సాకేతపురి ఆంజనేయస్వామి సేవా సమితి వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది. గత తొమ్మిది సంవత్సరముల నుండి స్వామి సన్నిధి భక్తుల సహాయంతో ప్రతినెల అమావాస్య సందర్భంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది, ఉదయం అంజన్న సన్నిధిలో స్వామికి ప్రత్యేకమైన పూజలు, సత్సంగము అనంతరం తీర్థప్రసాద వితరణ, అన్నప్రసాద వితరణ (అన్నదానం) భక్తుల సహాయ సహకారంలతో నిర్వహించడం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా, సహకరించిన భక్తులందరికీ సాకేతపురి ఆంజనేయస్వామి సేవా సమితి తరపున ధన్యవాదములు తెలియజేశారు,.ఈ కార్యక్రమంలో సాకేతపురి ఆంజనేయ స్వామి సేవా సమితి ,సాకేతపురి హనుమాన్ చాలీసా భక్త బృందం ,గ్రామ ప్రజలు, భక్తులు ,అధిక సంఖ్యలో పాల్గొన్నారు