కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గోపగోని బసవయ్య గౌడ్
పయనించే సూర్యుడు జనవరి 14 శంకరపట్నం మండలం రిపోర్టర్ పెద్ది గట్టయ్య: సీఎం సహాయనిధి పేదలకు పెన్నిదని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గోపగోని బస్వయ్య గౌడ్ అన్నారు. శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామంలో సోమవారం స్థానిక కార్యకర్తలతో కలిసి లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్యం పరంగా ఆపదలో ఉన్నవారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.పార్టీలకు అతీతంగా కేవలం అర్హతే ఆధారంగా సీఎం రిలీఫ్ ఫండ్ నిధులను ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు నేరెళ్ల సంతోష్, ఉపాధ్యక్షులు కల్లూరి సంతోష్, ప్రధాన కార్యదర్శి అన్నాడి తిరుపతిరెడ్డి, బీసీ సెల్ ప్రెసిడెంట్ రేగుల తిరుపతి, సీనియర్ నాయకులు కుంట తిరుపతిరెడ్డి,చీకట్ల కుమారస్వామి, పెంట సాంబయ్య,మోరే పోచయ్య, నాయకులు రాయిని రమేష్,గాజుల మహేష్,మనోచారి,మోరె సుదర్శన్, తదితరులు పాల్గొన్నారు