
పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 15(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)
యాడికి :స్టార్ ప్యారడైజ్ హైస్కూల్ లో సోమవారం ఇంజనీర్స్ డే ను ఘనంగా నిర్వహించారు.ఇంజనీరింగ్ విభాగంలో అద్భుతాలను సృష్టంచిన ప్రఖ్యాత ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి ని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి ఉపాధ్యాయులు, విద్యార్థులు పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా పాఠశాల మేనేజ్ మెంట్ నాగేంద్ర మాట్లాడుతూ భారతదేశ సాంకేతిక నైపుణ్యాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన మహనీయుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని తెలిపారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ఇంజనీర్స్ డే నిర్వహించుకుంటామని తెలిపారు. ఆయన స్ఫూర్తితో విద్యార్థులు మంచి క్రమశిక్షణతో ఉన్నత విద్యను అభ్యసించి భవిష్యత్తులో అత్యున్నత స్థాయిలో రాణించాలని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు శశినేత్ర, పరమేష్,అమరావతి, కుమారి పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.
