
పయనించే సూర్యుడు న్యూస్ 3 ఫిబ్రవరి (శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)యాడికి:యాడికిలోని స్టార్ ప్యారడైజ్ హైస్కూల్ లో వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. చదువుల తల్లి సరస్వతీ దేవి పూజను భక్తి శ్రద్దలతో నిర్వహించారు.ఈ సందర్బంగా విద్యార్థులతో నిర్వహించిన సమావేశంలో స్టార్ ప్యారడైజ్ హైస్కూల్ మేనేజ్ మెంట్ నాగేంద్ర, ఇలాహి, రంగ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలని తెలిపారు. తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణం గా ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని పరీక్షలలో మంచి మార్కులు సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయు లు సుమాంజలి, జ్ఞానేశ్వరీ,తహరున్, కుమారి, అమరావతి,ఉమాదేవి, అరుణ,రూప, రాజశేఖర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.