
పయనించే సూర్యుడు, జనవరి 30,బూర్గంపాడు మండల రిపోర్టర్ పోతుగంటి రామ్ ప్రసాద్
రాజ్యాధికారమే లక్ష్యంగా బీసీ లు కదం తొక్కుతున్నారు.తరతరాలుగా రాజకీయంగా ఆర్థికంగా, సామజికంగా తీవ్ర అణిచివేతకు గురి అవుతున్నాం మన బీసీలు.. ఇక తమ సత్తా చాటే దిశగా అడుగులు వేస్తున్నారు. జనాభాలో సగ భాగం పైనా ఉన్నాం అన్ని రంగాలల్లోను తీవ్ర అన్యాయానికి గురవుతున్నామని, ఇక సహించేది లేదంటూ రాజకీయ యుద్దబేరి మోగించేందుకు సిద్ధమవుతున్నాం. హలో బీసీ… చలో వరంగల్ కార్యక్రమం పిబ్రవరి 2 వ తారీఖున ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు లక్షలాది మందితో బీసీ రాజకీయ యుద్దబేరి కార్యక్రమాన్ని తీన్మార్ మల్లన్న, ఆర్ కృష్ణయ్య,ఆధ్వర్యంలో నిర్వహించేదుకు సన్నద్ధం అవుతున్నారు. ఈ మేరకు కులాలు, రాజకీయాలకు అతీతంగా అనేక కుల సంఘాలు, పార్టీ నేతలు, నాయకులు, యువత, కలిసికట్టుగా బీసీ లు తరలిరావాలంటూ తెలంగాణ బీసీ సంగం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు మహంకాళి రామారావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బెజ్జంకి కనకాచారి, సెక్రటరీ చీమల పాటి కోటేశ్వరరావు, పినపాక నియోజకవర్గం ఇంచార్జ్ నిదానపల్లి బాలకృష్ణ, బూర్గంపహాడ్ మండల అధ్యక్షులు దాసరి సాంబ,మండల ప్రధాన కార్యదర్శి మేకల నర్సింహారావు, ఉపాధ్యక్షులు చిప్పా రాజు బీసీ నాయకులు పాల్గొన్నారు.