తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కరీంనగర్ జిల్లా చైర్మన్ కనకం కుమారస్వామి
పయనించే సూర్యుడు శంకరపట్నం మండలం రిపోర్టర్ పెద్ది గట్టయ్య శంకరపట్నం మండల పరిధిలోని ఎరడపల్లి గ్రామ తెలంగాణ ఉద్యమకారులకు కరీంనగర్ జిల్లా ఉద్యమకారుల ఫోరం చైర్మన్ కనకం కుమారస్వామి తెలంగాణ ఉద్యమకారులు కలకుంట్ల రవీందర్రావు,తాళ్లపల్లి నారాయణ, సయ్యద్ అఫ్జల్, కనకం లక్ష్మణ్, కనకం శ్రీనివాస్ కనకం శ్రీహరి ఓదెల సాగర్,గార్లకు ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం చైర్మన్ కనకం కుమారస్వామి గారు మాట్లాడుతూ నాడు తెలంగాణ రాష్ట్రం కోసం ఎరడపల్లి గ్రామం నుండి తెలంగాణ ఉద్యమకారుల పాత్ర మరువలేనిదని తెలిపారు సీమాంధ్ర పార్టీలను వారి కుట్రలను ఎదుర్కొని అనేక నిర్బంధాలు పోలీస్ స్టేషన్లో బైండవర్లు ఎఫ్ఐఆర్ నమోదులు జైలు జీవితాలు గడిపిన చరిత్ర ఎరడపల్లి గ్రామ ఉద్యమకారులకు ఉందని చెప్పడం జరిగింది అదేవిధంగా నేడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి వారికి 250 గజాల భూమితో పాటు వారి సంక్షేమానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటామని ఈ ప్రజా ప్రభుత్వం ప్రకటించడం పట్ల ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలపడం జరిగింది అదేవిధంగా ఇచ్చినటువంటి హామీను కూడా త్వరగా అమలుపరిచి తెలంగాణ ఉద్యమకారుల జీవితాల్లో వెలుగులు నింపాలని ఈ ప్రభుత్వాన్ని కోరుకోవడం జరిగింది. ఏ ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు తెలంగాణ ఉద్యమకారులు పాల్గొన్నారు