PS Telugu News
Epaper

అంగన్వాడి సెంటర్లో అన్న ప్రసన్న వేడుకలు

📅 26 Mar 2026 ⏱️ 6:26 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించె సూర్యుడు మార్చి 26(పొనకంటి ఉపేందర్ రావు )

ఇల్లందు :16 వార్డు నందు అర్జున్ బస్తి ఆర్ఎంఏ అంగన్వాడి కేంద్రంలో గురువారం మున్సిపల్ కౌన్సిలర్ శ్రీమతి ఉల్లింగ విజయలక్ష్మిచేతుల మీదుగా అన్న ప్రసన్న కార్యక్రమం నిర్వహించారు. పిల్లలు, బాలింతలు ఆరోగ్యంగా ఉండాలంటే అంగన్వాడీలో అందించే పౌష్టిక విలువలు కలిగిన ఆహారం బాలింతలు మరియు పిల్లలు క్రమం తప్పకుండా తీసుకోవాలని కౌన్సిలర్ విజయలక్ష్మి మరియు టీచర్ రత్నకుమారి తెలిపారు. అనంతరం నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్ శ్రీమతి విజయలక్ష్మిశాలువ సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీచర్ రత్నకుమారి హెల్పర్ కే అరుణకుమారి ఆశ వర్కర్ జె లత, పేరెంట్స్ రోజా, మందిబ్, పద్మ, రెహాన్, నయ, విద్యార్థులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.

Scroll to Top