అంగన్వాడి సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు.
పయనించే సూర్యుడుD.9.7.2026 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్…. భీంగల్ ప్రాజెక్ట్ సిడిపిఓ జ్ఞానేశ్వరి.*ఎర్గట్ల మండల కేంద్రంలోఅంగన్వాడి కేంద్రాలలో సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే శాఖపరమైన చర్యలు తప్పవని భీంగల్ ప్రాజెక్టు సిడిపిఓ జ్ఞానేశ్వరి తెలిపారు. గురువారం రోజున ఏర్గట్లలోని అంగన్వాడి సెంటర్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మండల కేంద్రంలోని ఒక సెంటర్ లో ఆయా పై వచ్చిన ఆరోపణలను ఆమె పరిశీలించారు. ఆయ కు చిన్న పాప ఉండడంతో ఆయా కూడా అంగన్వాడి సెంటర్ లోనే కూర్చుని ఆమె అత్తఆయాకు వీధుల్లో హెల్ప్ చేస్తున్నారు అని నిర్ధారించడం జరిగింది. అలాగే మీడియా మిత్రులు, లబ్ధిదారులు, గ్రామస్తులు ఎవరైనా సరే అంగన్వాడి కేంద్రాలలో సిబ్బంది నిర్లక్ష్యం వహించినట్లు, లబ్ధిదారులకు సరైన లబ్ది చేకూరానట్లయితే మా దృష్టికి తేవాలని ఆమె సూచించారు. విధులలో నిర్లక్ష్యం వహిస్తే శాఖ పరమైన చర్యలు తప్పవని అంగన్వాడి సిబ్బందిని హెచ్చరించారు. ప్రతి నెల తప్పకుండా మండలంలోని అన్ని సెంటర్లను విసిట్ చేస్తూ అంగన్వాడి కేంద్రాలలో లబ్ధిదారులకు చేకూరే లబ్ధిలో ఎలాంటి ఆటంకాలు జరగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు ఆమె తెలిపారు. మన అంగన్వాడి మన బాధ్యత అనే కోణంలో అందరూ సమన్వయంతో ముందుకెళ్లాలని ఆమె సూచించారుఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు, సూపర్ వైజర్ లబ్ధిదారులు పాల్గొన్నారు