సొంత గ్రామ అభివృద్ధికి అండగా: పాఠశాలకు రూ.10 లక్షల విరాళం సింహాద్రి

July 9, 2026 | ఆంధ్రప్రదేశ్

దాతల సహకారం అభినందనీయం ఎమ్మెల్యే దాట్ల


పయ నించే సూర్యుడు జూలై 9 ముమ్మిడివరం ప్రతినిధి (గ్రంధి నానాజీ)డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంకాట్రేనికోన : కేవలం డబ్బు సంపాదించడమే కాకుండా, సమాజం పట్ల దాతృత్వ భావాన్ని కలిగి ఉండటమే మానవుడి ఉన్నతమైన ఆదర్శ గుణాన్ని చాటిచెప్పుటకు ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు కొనియాడారు. కీర్తిశేషులు పట్టా అప్పారావు, సత్యవతి జ్ఞాపకార్థం వారి కుమారులు, ప్రముఖ చిత్ర కారులైన పట్టా సింహాద్రి, పట్టా వెంకటేశ్వరరావులు రూ.10 లక్షల భారీ ఆర్థిక సహాయంతో కాట్రేనికోన ఉన్నత పాఠశాల విద్యార్థుల కోసం ఒక సుందరమైన డైనింగ్ హాల్ భోజన శాలను నిర్మించారు. ఈ డైనింగ్ హాల్ను బుధవారం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కాట్రేనికోన గ్రామానికి చెందిన సింహాద్రి, వెంకటేశ్వరావు ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రకారులుగా స్థిరపడినప్పటికీ, తమ సొంత ఊరిని, తాము చదువుకున్న పాఠశాలను మరువకుండా విద్యార్థుల కోసం ఇంతటి ఉదారమైన సేవలు అందించడం ఎంతో ఆదర్శప్రాయమని ప్రశంసించారు. పాఠశాల పూర్వ ఉపాధ్యాయులు కీర్తిశేషులు దువ్వారి సాంబశివరావు జ్ఞాపకార్థం వారి కుమార్తె మహాలక్ష్మి రూ.20 వేల ఆర్థిక సహాయంతో పాఠశాలలో కానిటరీ సౌకర్యాలను ఏర్పాటు చేసి విద్యార్థుల పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. చిత్రకారుడు, దాత అయిన పట్టా సింహాద్రి సమాజానికి చేసిన సేవలను గుర్తిస్తూ, రాజోలు కోనసీమ చిత్రకళా పరిషత్ 37వ వార్షికోత్సవంలో ఆయనకు “జీవన సాఫల్య పురస్కారం” అందించి సత్కరించినట్టు పరిషత్ అధ్యక్షులు కె. సీతారామస్వామి సగర్వంగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ బి. రాజేశ్వరావు, తహసీల్దార్ రవి కిరణ్, పాఠశాల హెచ్ఎం.ఆర్. అంబ, టిడిపి మండల అధ్యక్షులు చెల్లి సురేష్ మాజీ మత్స్య శాఖ కార్పొరేషన్ డైరెక్టర్ నాగిడి నాగేశ్వరావు, మండల ఇంచార్జ్ దాట్ల పవన్, కాట్రేనికోన డిసి చైర్మన్ ఆకాశం శ్రీనివాస్, ముమ్మిడారం వ్యవసాయ మార్కెటింగ్ చైర్మన్ ఓగిరి భాగ్యశ్రీ, మోకా బాల ప్రసాద్, పి ఎస్ ఎన్ రాజు విత్తనాల నాగ శ్రీనివాసరావు, విత్తనాల వెంకటరమణ తెలుగు యువత అధ్యక్షుడు గంగాధర్ బాబు .గంటి పంచాయతీ మాజీ ప్రెసిడెంట్ వెంకట సుధాకర్ ,నల్ల నరసింహమూర్తి, పిల్లి ప్రసాద్, సాన బోయిన నాగేశ్వరరావు, కోళ్ల శ్రీనివాసరావు, యల్లమిల్లి త్రినాథ్, చింతా రాంబాబు, ఇసుకపట్ట రాంబాబు, మోకా అప్పాజీ, మాదే యోగేశ్వరి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభలో విద్యార్థులు ఉత్సాహంగా ఎంపీడీఓ రాజేశ్వరావు ఆలపించిన గేయాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

🌐 Select Language:
📰 ePaper