అంతర్జాతీయ స్నేహ దినోత్సవం, ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ పిలుపు

July 30, 2026 | ఆంధ్రప్రదేశ్

పయ నించే సూర్యుడు జూలై 30 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ : రామచంద్రపురం:ప్రతి ఏడాది జూలై 30న నిర్వహిస్తున్న అంతర్జాతీయ స్నేహ దినోత్సవం మరియు ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రజలకు శుభాకాంక్షలు, సందేశాన్ని తెలియజేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్నేహం అనేది మనుషులను కలిపే గొప్ప బంధమని, ప్రేమ, విశ్వాసం, పరస్పర గౌరవం, సహకారం వంటి విలువలను పెంపొందించడంలో స్నేహానికి ప్రత్యేక స్థానం ఉందన్నారు. యువత మంచి స్నేహాలను పెంపొందించుకుని సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు. ప్రజలు.. దేశాలు.. సంస్కృతుల మధ్య స్నేహం,శాంతి భావాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.అదేవిధంగా, మానవ అక్రమ రవాణా అనేది సమాజానికి మచ్చ తెచ్చే ఘోర నేరమని పేర్కొన్నారు. మహిళలు, చిన్నారులు, బలహీన వర్గాలపై జరుగుతున్న అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. అనుమానాస్పద ఘటనలు కనిపిస్తే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించి బాధితులను రక్షించేందుకు సహకరించాలని కోరారు. ప్రజల్లో అవగాహన పెంపొందించడం, బాధితులకు రక్షణ కల్పించడం, నేరస్థులపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా మాత్రమే మానవ అక్రమ రవాణాను పూర్తిగా నిర్మూలించగలమని మంత్రి సుభాష్ తెలిపారు.స్నేహ బంధాలను బలోపేతం చేద్దాం… మానవ అక్రమ రవాణా రహిత సమాజ నిర్మాణానికి కలిసి పనిచేద్దాం అని మంత్రి వాసంశెట్టి సుభాష్ పిలుపునిచ్చారు.

🌐 Select Language:
📰 ePaper