కొమర గిరి లో స్వచ్ఛ ఆంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమం – ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు_
పయనించే సూర్యుడు సెప్టెంబర్ 19 ముమ్మిడివరం ప్రతినిధి (గ్రంధి నానాజీ) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం కొమరగిరి గ్రామంలో ఈరోజు నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ప్రభుత్వ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో డా.బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి, మండల పార్టీ అధ్యక్షులు సాగిరాజు సూరిబాబు రాజు, ఇతర కూటమి నాయకులు, అభిమానులు, ప్రజలు, అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ పరిశుభ్రమైన పరిసరాలే ఆరోగ్యకరమైన సమాజానికి పునాది అని పేర్కొన్నారు. స్వచ్ఛతను కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.అనంతరం ప్రజలు, అధికారులు, నాయకులతో కలిసి స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు.మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ స్వచ్ఛమైన గ్రామాలు-ఆరోగ్యకరమైన సమాజం లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రతిజ్ఞ చేయించారు.కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.స్వచ్ఛ ఆంధ్ర-స్వర్ణాంధ్ర…మనందరి బాధ్యత, మనందరి భాగస్వామ్యం.