PS Telugu News
Epaper

అందరం కలిసికట్టుగా పని చేద్దాం… భీంగల్ మున్సిపాలిటీ పై గులాబీ జెండా ఎగురేద్దాం

📅 06 Jan 2026 ⏱️ 1:51 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్

నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో భీంగల్ ను అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్, బి ఆర్ ఎస్ దే..
ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడిగే అర్హత ఒక్క BRS బి ఆర్ ఎస్ కే ఉంది. మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి గడిచిన 10 ఏండ్లలో భీంగల్ ను అభివృద్ధి చేసిన ఘనత బి ఆర్ ఎస్ దే అని రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రజలకు ఓట్లు అడిగే అర్హత ఒక్క ఆర్ ఎస్ పార్టీకే ఉంది అని వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. వేల్పూర్ ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన భీంగల్ మున్సిపాలిటీ ముఖ్య నాయకుల సమావేశంలో ఎమ్మెల్యే వేముల మాట్లాడుతూ బీఆర్ఎస్ కార్యకర్తలు అందరం ఎలాంటి బేషజాలు లేకుండా కలిసికట్టుగా పని చేసి మరొక్క సారి భీంగల్ మున్సిపాలిటీ పై గులాబీ జెండా ఎగురావేయాలని అన్నారు.
భీంగల్ గ్రామ పంచాయతీ గా ఉంటే నిధులు తక్కువగా ఉంటాయని, పెద్దలు సలహాల సూచనల మేరకు భీంగల్ ను మున్సిపాలిటీ చేసుకోవడం జరిగింది. ప్రజల ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యేగా గెలిచిన మొదటిసారి 2016 లోనే భీంగల్ ప్రతి గల్లీ గల్లీ తిరిగిన భీంగల్ పరిస్థితి చాలా దారుణంగా ఉండే భీంగల్ అభివృద్ధి కొరకు ఒక ప్రణాళిక తయారు చేసుకోవడం జరిగింది భీంగల్ అభివృద్ధికి ఒక 25 కోట్లు అవసరం అయ్యాయి
కేటీఆర్ గారి సహకారంతో 25 కోట్లు మంజూరు చేయించుకొని భీంగల్ ఇంటర్నల్ రోడ్లు అభివృద్ధి చేసుకొన్నాం
ఆర్. అండ్. బి శాఖ మంత్రి గా అయిన తరువాత భీంగల్ మెయిన్ రోడ్లు అన్ని సెంట్రల్ లైంటింగ్ డివైడర్ లుగా మార్చుకోవడం జరిగింది ఇంకా మిగిలిపోయిన పనుల కోసం కుడా కేటీఆర్ ని అడిగి 10 కోట్లు మంజూరు చేసుకొని వివిధ పనులకు టెండర్లు కుడా అయ్యాయి ప్రభుత్వం మారిన తరువాత టెండర్లు అయిన పనులను కుడా ఈ ప్రభుత్వం వచ్చాక రెండేడ్లు ఆపింది, ఎక్కడ తట్టేడు మట్టి కుడా తీయలేదు
భీంగల్ కు చేసిన అభివృద్ధి కి ప్రజలు కుడా మనల్ని అక్కున చేర్చుకున్నారు బాల్కొండ నియోజకవర్గం లో 40 సర్పంచ్ లు గెలిచాం.ప్రజలు మనవైపు ఉన్నారు క్యాడర్ మొత్తం కలిసి పని చేస్తే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మనం మళ్ళొక్కసారి అన్ని కౌన్సిలర్లు గెలుస్తాం. రాష్ట్రంలో అన్ని కౌన్సిల్లర్లు గెలిచినా ఏకైక మున్సిపాలిటీ మన భీంగల్ మున్సిపాలిటీ కార్యకర్తల మధ్య సమన్వయ లోపం భీంగల్ మున్సిపాలిటీ లో కనబడకూడదు భీంగల్ ల బి ఆర్ ఎస్ పార్టీకి కి ప్రజల్లో ఒక గౌరవం ఉంది 2014 కంటే ముందు భీంగల్ తో పోల్చితే ఇప్పుడు భీంగల్ ఈ స్థాయిలో ఉంది అంటే డానికి కారణం కేసీఆర్, బి ఆర్ ఎస్ పార్టీ సూచించిన అభ్యర్థుల గెలుపు కొరకు నేను ఇంటింటికి తిరుగుతా.. కార్యకర్తలుగా మీరందరు సమిష్టిగా పని చేయండి ప్రజలు మైనవైపే ఉంటారు. కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ఎలక్షన్ అప్పుడే అన్ని ఇస్తున్నారు.ఎలక్షన్ లు ఐపోతే అన్ని ఎగ్గోడుతున్నారు రుణమాఫీ పూర్తిగా అమలు కాలేదు,రైతుబందు సరిగ్గా వేయటానికి లేదు. సకాలంలో ఎరువులు అందివ్వటం లేదు.మహిళలకు 2500 లేదు,ఆసరా పెన్షన్ 4000 చేయలేదు. ఇలా ప్రజలకు ఇచ్చిన అనేక హామీలు ఏ ఒక్కటి సక్రమంగా అమలు చేయలేదు భీంగల్ లో రెండేండ్లలో ఎక్కడ తట్టేడు మట్టి తీయలేదు..100 పడకల హాస్పిటల్, వెజ్ నాన్ వెజ్ మార్కెట్ లు పనులు ఆగిపోయాయి
ఇప్పుడు మంత్రి ని తీస్కోచ్చి పాత సంక్షన్ పనులకు కొబ్బరికాయ కొట్టించే ప్రయత్నం చేస్తున్నారు
ప్రజలు కాంగ్రెస్ పై కోపంతో ఉన్నారు.ఎన్నికలు వచ్చినపుడు కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయం అని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు.

Scroll to Top