అంబంలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన సీఐ, ఎస్సై…
రుద్రూర్, నవంబర్ 26 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) :
రానున్న సర్పంచ్ ఎన్నికలలో భాగంగా రుద్రూర్ మండలంలోని అంబం(ఆర్) గ్రామంలో పోలింగ్ కేంద్రాలను మంగళవారం సీఐ కృష్ణ, ఎస్సై సాయన్న పరిశీలించారు. గ్రామపంచాయతీ కార్యదర్శి, సిబ్బంది, స్థానిక వాసులతో సమావేశం ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకున్నారు. గ్రామాలల్లోని రాజకీయ పరిస్థితుల గురించి ఆరా తీశారు. పోలింగ్ రోజున అవసరమైన భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు.