అంబేద్కర్ ధర్మ పోరాట సమితి 30 వసంతాల మహాసభ
పయనించే సూర్యుడు డిసెంబర్ 18 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు )
అంబేద్కర్ ధర్మ పోరాట సమితి (ఏ. డి. పి.ఎస్)ఆధ్వర్యంలో డిసెంబర్ 25న నెల్లూరు నగరంలో గల డాక్టర్ బి . ఆర్ అంబేడ్కర్ భవనము నందు ఉదయం 11 గంటలకు మరియు మధ్యాహ్నం 3 గంటలకు జరుగు అంబేడ్కర్ బౌద్ధ ధమ్మ స్వీకార కార్యక్రమాన్నీ మరియు . ఏ . డి. పి.ఎస్.(అంబేడ్కర్ ధర్మ పోరాట సమితి)30 వసంతాల మహాసభను జయప్రదం చేయాలని జిల్లా పర్యటన చేస్తున్న ఏ.డి.పి.ఎస్. వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు మాస్టర్ రామచంద్ర రావు ఇంగిలాల ఈరోజు సూళ్లూరుపేట రావడం జరిగింది. సూళ్లూరుపేట ఆర్ . ఎండ్. బి బంగళాలో ప్రెస్ మీట్ లో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా మాస్టర్ రామచంద్ర రావు మాట్లాడుతూ ఏ.డి.పి.ఎస్..30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నెల్లూరు నగరంలో పై సభలు జరగతాయని ఈ సభలకు దళిత బహుజనులు నిండుమనసుతో దండిగా వచ్చి అంబేడ్కర్ ధర్మ పోరాట సమితి (ఏ. డి. పి.ఎస్)30వసంతాల మహాసభను మరియు అంబేడ్కర్ బౌద్ధ ధమ్మ స్వీకార కార్యక్రమాన్నీ జయప్రదం చేయాల్సిందిగా ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో ఏ.డి.పి.ఎస్ రాష్ట్ర అధ్యక్షులు యరబోతు సుబ్రహ్మణ్యం , ఏ . డి.పి.ఎస్.తిరుపతి జిల్లా ఉపాధ్యక్షులు కుదిరి గోపి ,తిరుపతి జిల్లా కార్యవర్గసభ్యులు చింతల మాధవయ్య , సూళ్లూరుపేట మండల అధ్యక్షుడు ఆవుల చెంగయ్య ,మండల ప్రధాన కార్యదర్శి పోలూరు రవి , మండల కార్యవర్గ సభ్యులు దూడల సుధాకర్ , మీజూరు వెంకటేష్ గారు, బందిల నడిపయ్య గారు,మతకామూడి మునీంద్రన్నగారు,మరియు ఏ . డి.పి.ఎస్.కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.
