PS Telugu News
Epaper

అంబేద్కర్ భవనం వెంటనే నిర్మించాలి

📅 05 Sep 2025 ⏱️ 5:53 PM 📝 HOME
Listen to this article

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 5 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు )మాల మహానాడు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆవల దాసు తెలియజేయు విషయం ఏమనగా.. దళితులకు బడుగు బలహీ న వర్గాలకు అవమానం కలిగిన దినం. ఎస్సీ నియోజకవర్గమైన సూళ్లూరుపేటలో అంబేడ్కర్ భవనముకై పత్రికా ముఖంగాను, ఎమ్మెల్యే ముఖంగాను, మున్సిపల్ కమిషనర్ ముఖంగాను, జులై15, 25 మరియు ఆగస్టు 8 తేదీలలో తెలియపరచిన విధంగ ఆర్డీవో ఆఫీస్ పక్కన ఉన్న అంబేడ్కర్ భవనానికి కేటాయించిన స్థలం నందు. మురికి నీరు అడ్డంకులను తొలగించి అంబేడ్కర్ భవన నిర్మాణము చేపట్టమని విన్నవించడం జరిగింది. ఇది పత్రికా ముఖంగా మీ అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇంతవరకు అధికారులు, నాయకులు నిమ్మకు నీరు తినట్టు ఏమి తెలియనట్టు ప్రవర్తించడం బాధాకరం. ఇది ఎస్సీలకు అవమానకరం. డాక్టర్ అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్ ద్వారా ఎమ్మెల్యేలుగా సూళ్లూరుపేట నియోజకవర్గం లో చాలామంది ఎమ్మెల్యేలుగా పనిచేశారు. అంబేడ్కర్ కల్పించిన రిజర్వేషన్ ద్వారా మేము శాసన సభ్యులుగా ఉన్నామని చెప్పుకుంటూ. ఆనాటి నుండి ఈరోజు వరకు ఎస్సీల కొరకు అంబేడ్కర్ భవనం నిర్మించకపోవడం ఒక బ్లాక్ డేగా మిగిలిపోయింది. పేరుకే సూళ్లూరుపేట ఎస్సీ నియోజకవర్గం. ఇక్కడ ఎస్సీలకు ఒక పని కూడా జరిగింది లేదు. మాల మహానాడు నుండి మూడుసార్లు సూళ్లూరుపేట మున్సిపల్ కమిషనర్ ని నియోజకవర్గ శాసన సభ్యురాలు ని అంబేడ్కర్ భవన నిర్మాణముకై కలవడం జరిగింది. అప్పుడు వారు మాకు ఇచ్చిన సమాధానం నిధులు మంజూరు అయినవి 15, 20 రోజులలో భవనం పనులు మొదలు పెడతామని అన్నారు. అలా అంటున్నారే కానీ ఇంత వరకు ఏవిధమైనటువంటి పనులు జరగలేదు. ఎస్సీ నియోజకవర్గంలో ఉన్న ఎస్సీ ఎస్టీలకు అవమానించి ఆత్మగౌరవాన్ని చంపుతున్నట్టే. నాయకులకు,అధికారులకు ఇంత నిర్లక్ష్యం తగదని మాల మహానాడు నుండి తెలియజేస్తున్నాము. అంబేడ్కర్ దయతో సూళ్లూరుపేట ఎస్సీ నియోజకవర్గంలో ఎంతోమంది శాసనసభ్యులుగా వచ్చారు వెళ్లారు తప్ప ఎస్సీలకు ఏ మాత్రం ఉపయోగపడింది లేదు అంబేద్కర్ భవనముకైనా నిధులు మంజూరైన విషయం తెలిసిన సంగతే కావున సూళ్లూరుపేట ఎస్సీ శాసనసభ్యురాలు త్వరగా చొరవ చూపాలి ని కోరుకుంటున్నాము అలా లేనియెడల సూళ్లూరుపేట నియోజకవర్గం నుండి మండలాల నుండి గ్రామాల నుండి ఎస్సీ ఎస్టీలు అందరూ బహిరంగంగా రోడ్లు పైకి రావాల్సి వస్తుంది అందుచేత మా యొక్క మనోభావాలు దెబ్బ తినకముందే భవన పనులు మొదలుపెట్టాలని మాల మహానాడు నుండి కోరుతున్నాం

Scroll to Top