అగాపే ఆశ్రమంలో అన్నదానం
పయనించే సూర్యుడు న్యూస్ ఫిబ్రవరి 7 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి.
యాడికి మండలం, కమలపాడు రోడ్డు, రాఘవేంద్ర కాలనీలో ఉన్న అగాపే ఆశ్రమంలో వేములపాడు గ్రామంలో నివాసం ఉంటున్న చుక్కలూరు పవన్ కుమార్ రెడ్డి భార్య భాగ్యలక్ష్మి వీరి కుమారుడు రంజిత్ కుమార్ రెడ్డి 1వ వర్ధంతి ని జ్ఞాపకం చేసుకుంటూ తన ఆత్మకు శాంతి చేకూరాలని ఆశ్రమంలోని వృద్ధులకు, నిరాశ్రయులందరికీ అన్నదానం ఏర్పాటు చేశారు. పెదనాన్నలు రామానందరెడ్డి, పురుషోత్తం రెడ్డి, అన్నలు, చెల్లెలు సహారిక పాల్గొన్నారు. ఇందు నిమిత్తమై ఆశ్రమ ఫౌండర్ బత్తల ప్రసాద్, ఆశ్రమంలోని వారంతా వారి కుమారునికి నివాళి అర్పించి, కుటుంబానికి ధన్యవాదాలు తెలిపారు.
