PS Telugu News
Epaper

అగాపే ఆశ్రమంలో నూతన వస్త్రాలు పంపిణీ.

📅 09 Dec 2025 ⏱️ 6:50 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్ 9 శర్వాస్ వలి మండల రిపోర్టర్ యాడికి

యాడికి మండలం, కమలపాడు రోడ్డు, రాఘవేంద్ర కాలనీలో ఉన్న అగాపే ఆశ్రమంలో జమ్మలమడుగులో నివాసం ఉంటున్న రియల్ గాడ్ గాస్పల్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు రెవరెండ్ దూళ్ళ డేవిడ్ గారు భార్య దీవెనమ్మ వారి కుటుంబం జయకర్, బాబు, బ్యూలా, మనవడు యోనా, యోనోష వీరి కుటుంబము ఆశ్రమంలోని నిరాశ్రయులందరికీ ఏసుక్రీస్తు జన్మదిన శుభ సందర్భంగా 45 మందికి స్త్రీలకు, పురుషులకు 20వేల రూపాయలు ఖర్చుపెట్టి నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. అంతేకాకుండా అన్నదానం కూడా ఏర్పాటు చేశారు. క్రిస్మస్ అంటే భక్తి మాత్రమే కాదు బీదలకు, నిస్సహాయ స్థితిలో ఉన్నవారికి చేతనైనంత సహాయము అందించడం, అలాంటి వారిని పరామర్శించడం, అదే క్రీస్తు నేర్పిన ప్రేమ. ఆ ప్రేమే మేము పదిమందికి పంచుతున్నాము. అని ఈ విధంగా ఆశ్రమానికి విచ్చేసి ఇలాగా వీరిని నూతన వస్త్రాలతో సంతోషపరచి, భోజనం వడ్డించినందుకు వారు ఆనంద వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఇమ్మానుయేల్ గాడ్ విజన్ మినిస్ట్రీస్ పాస్టర్ చిట్టి బాబు గారు, పాస్టర్ జయపాల్ గారు పాల్గొన్నారు.ఇందు నిమిత్తమై ఆశ్రమ ఫౌండర్ బత్తల ప్రసాద్, ఆశ్రమంలోని వారంతా వారికి వారి కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు.

Scroll to Top