అగ్రకుల పెతందారులను కఠినంగా శిక్షించాలి: భోగరాజు శ్రవణ్ కుమార్
పయనించే సూర్యుడు న్యూస్ కనగల్ ఫిబ్రవరి 26.
కనగల్ మండలం జి . యడవల్లి గ్రామంలోని యువకులంతా మరణించిన రెండు నెలల పసి బిడ్డకు కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు.నాగర్ కర్నూల్ జిల్లాలో కుమ్మెర మల్లన్న జాతర సందర్భంగా మల్లన్న ఆలయంలోకి స్వామివారి దర్శనం కోసం బీసీ రజక కుటుంబానికి చెందిన గణేష్* , తన భార్య మౌనిక రెండు నెలల కూతురితో వెళ్లారు ఆలయ నిర్వహకుడు శ్రీనివాసరెడ్డితో గొడవ విషయంలో చిన్నారి పసికందు మృతి చెందడం జరిగింది .అగ్రకుల అహంకారంతో అధికార పార్టీ అండదండలతో ఇలాంటి దాడికి పాల్పడుతున్న దుర్మార్గులు .రెండు నెలల చిన్నారి ఆత్మకి శాంతి కలగాలని ఈరోజు మన గ్రామంలో *సాయంత్రం6:30కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది .ఈ కార్యక్రమంలో పార్టీలకతీతంగా గ్రామంలో ఉన్న యువకులు పెద్దలు ఈ యొక్క ర్యాలీలో *పాల్గొన్నారు.
