PS Telugu News
Epaper

అడవినుంచి రోడ్డుపైకి జింక… వాహనం ఢీకొని గాయాలు !

📅 22 Mar 2026 ⏱️ 12:02 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు మార్చి 22( సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు)

తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలో కోటపోలూరు రోడ్డుకు మున్నా బాయ్ డాబాకు సమీపంలోని అటవీ ప్రాంతం నుంచి ఒక జింక రోడ్డుపైకి వచ్చి ప్రమాదానికి గురైంది. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో జింక తీవ్రంగా గాయపడింది. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు, రోడ్ సేఫ్టీ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన జింకను జాగ్రత్తగా సంరక్షించి అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. అటవీ ప్రాంతాల్లో నీటి కొరత తీవ్రంగా ఉండటంతో జంతువులు బయటకు వస్తున్నాయని స్థానికులు తెలిపారు. నీళ్లు కోసం పొలాల వైపు వస్తూ రోడ్డు దాటే సమయంలో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. ఇదే ప్రాంతంలో ఇలాంటి ఘటన ఇది రెండోసారి కావడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది.

Scroll to Top