PS Telugu News
Epaper

అణగారిన వర్గాల ఐక్యతే జ్యోతిరావు పూలే బీసీ సంఘం లక్ష్యం ఈసరి శ్రావణ్ కుమార్

📅 13 Apr 2026 ⏱️ 7:11 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

{ పయనించే సూర్యుడు} {ఏప్రిల్ 14మక్తల్ }

సామాజిక న్యాయం కోసం పోరాడిన మహనీయుడు బిందెశ్వర్ ప్రసాద్ మండల్. వర్ధంతి సందర్భంగా ఈరోజు జ్యోతిరావు పూలే బీసీ సంఘం ఆధ్వర్యంలో ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈసరి శ్రావణ్ కుమార్. మాట్లాడుతూ సమగ్ర సామాజిక చైతన్యం, మా సంఘం కేవలం ఒక వర్గానికి మాత్రమే పరిమితం కాదు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన ప్రతి ఒక్కరి గొంతుకగా నిలవడమే మా ఉద్దేశ్యం. బీసీలతో పాటుగా సమాజంలోని అన్ని వెనుకబడిన కులాలను కూడా చైతన్య పరిచే ఒక బృహత్తర కార్యక్రమాన్ని మేము త్వరలోనే చేపట్టబోతున్నాం” అని స్పష్టం చేశారు.మండల్ సిఫార్సుల సాధన: బిందెశ్వర్ ప్రసాద్ మండల్. సూచించిన సామాజిక సమానత్వం కేవలం కొన్ని కులాలకే పరిమితం కాకూడదని, అణగారిన అన్ని శ్రమజీవి వర్గాలు చట్టసభల్లో మరియు ఆర్థిక రంగంలో తమ వాటాను పొందినప్పుడే నిజమైన సామాజిక న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు.అందరినీ కలుపుకొని ముందడుగు, జ్యోతిరావు పూలే బీసీ సంఘం త్వరలో చేపట్టబోయే కార్యక్రమాల్లో అన్ని వెనుకబడిన వర్గాల నాయకులను, మేధావులను భాగస్వామ్యం చేస్తామని, కులాల మధ్య దూరం తగ్గించి ఒక ఐక్య శక్తిగా ముందుకు సాగుతామని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వాకిటి భాస్కర్, మంగలి రవికుమార్, నాగరాజు, గుంతలు ప్రవీణ్ కుమార్, మంగలి వెంకటేష్, వాకిటి రాకేష్ నాని, నజీర్, గుంతలు ఆంజనేయులు, కురువ ఎల్లప్ప, వాకిటి శ్రీనివాసులు, బాల్ రాజ్ సంఘం ప్రతినిధులు మరియు ఇతర సామాజిక నాయకులు పాల్గొన్నారు.

Scroll to Top