అనిల్ పురిటి మరియు చిన్నపిల్లల హాస్పటల్ ను ప్రారంభించిన మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్.
పయనించే సూర్యుడు జనవరి 08,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న
నంద్యాల స్థానిక శ్రీనివాస్ సెంటర్ బిగ్ సి మొబైల్ షోరూం ఎదురుగా బుధవారం “అనిల్ పురిటి మరియు చిన్నపిల్లల హాస్పిటల్” అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ప్రముఖ శిశువైద్య నిపుణులు డాక్టర్ పి. అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రిని రాష్ట్ర న్యాయ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ , శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై హాస్పిటల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ నంద్యాల ప్రాంత ప్రజలకు, ముఖ్యంగా పసిబిడ్డలకు మరియు చిన్నపిల్లలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి ఈ ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని కొనియాడారు. అత్యాధునిక వసతులతో కూడిన ఇటువంటి ఆసుపత్రులు స్థానిక ప్రజలకు ఎంతో అవసరమని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్, నీటి సంఘాల చైర్మన్ బనూరు రామలింగారెడ్డి, జైలాన్, మరియు పట్టణ ప్రముఖులు, వైద్యులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

