PS Telugu News
Epaper

అన్నారంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

📅 26 Feb 2026 ⏱️ 7:13 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

( పయనించే సూర్యుడు ఫిబ్రవరి 26 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)

ఫరూఖ్ నగర్ మండలంలోని అన్నారం గ్రామంలో షాద్ నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్ గారు పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా డీ.ఎం.ఎఫ్.టి నిధులు 6 లక్షలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం,ఎస్డీఎఫ్ నిధులు 32 లక్షలతో అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బాలరాజు గౌడ్,ఫరూఖ్ నగర్ మండల అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి,రఘు గౌడ్,రాయికల్ శ్రీనివాస్,రామకృష్ణ, కంసాన్ పల్లీ శేఖర్, రాములు గౌడ్,సురేష్ యాదవ్,బాలు నాయక్,రాయికల్ సర్పంచ్ జ్యోతి,అన్నారం సర్పంచ్ లావణ్య,పంచాయతీ రాజ్ ఏఈ గోపాల్, ఫరూఖ్ నగర్ మండల పంచాయతీ అధికారి జయంత్ రెడ్డి,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top