PS Telugu News
Epaper

అభిమానుల గుండెల్లో పవర్ స్టార్ కి ప్రత్యేక స్థానం

📅 18 Mar 2026 ⏱️ 1:11 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

ఉస్తాద్ భగత్ సింగ్ భారీ విజయం సాధిస్తుంది

పవన్ కళ్యాణ్ వీరాభిమాని – వారణాసి తరుణ్ కుమార్

పయనించే సూర్యుడు మార్చి 19 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్

ఒక సాధారణ హీరో స్థాయి నుండి తెలుగు ఇండస్ట్రీ సూపర్ స్టార్ స్థాయికి ఎదిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గా ప్రజా సేవ చేస్తున్న కొణిదెల పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ ఉగాది సందర్బంగా విడుదలకు సిద్ధం అయింది. ఈ చిత్రం విడుదల సందర్బంగా పవన్ కళ్యాణ్ వీరాభిమాని వారణాసి తరుణ్ కుమార్ మీడియా మిత్రులతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ అన్నకు అభిమానిగా పుట్టడం నా అదృష్టం అని, మెగాస్టార్ చిరంజీవి కి తమ్ముడు గా ఇండస్ట్రీకి పరిచయమై నేడు సమాజ సేవకోసం రాజకీయ పార్టీ స్థాపించి, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గా ఉన్న పవన్ అన్న నూతన చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ భారీ విజయం సాధించాలని కోరుకున్నారు. ఏన్కూర్ సినిమా థియేటర్ లో అభిమానులకు ఇటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తామని, ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని ఆధరించాలని అన్నారు..

Scroll to Top