అమరావతి లో అమరజీవి పొట్టి శ్రీరాములు 58 అడుగుల కాంశ్య విగ్రహం ఆవిష్కరణ పాల్గొన్న ఆర్య వైశ్య డైరెక్టర్లు
జనం న్యూస్ మార్చి 16 ముమ్మిడివరం ప్రతినిధి
అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా సోమవారం ఉదయం అమరావతి దగ్గరలోని తుళ్లూరు గ్రామంలో అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన పొట్టి శ్రీరాములు గారి 58 అడుగుల కాంస్య విగ్రహన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, రాష్ట్ర ఆర్యవైశ్యుల 42 డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డూండీ రాకేష్, తదితర మంత్రులు ప్రజాప్రతినిధులు ఆధ్వర్యంలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కంకటాల రామం. తాడేపల్లిగూడెం ఆర్యవైశ్య డైరెక్టర్ పద్మనాభుని మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు