PS Telugu News
Epaper

అమరుల ఆశయాల ఎర్రజెండా ను ఎత్తుకున్న మసివాగు ప్రజలు సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా (మాస్ లైన్) పార్టీలో 30 కుటుంబాలు చేరిక

📅 01 Dec 2025 ⏱️ 12:34 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నవంబర్ 30(పొనకంటి ఉపేందర్ రావు ) ఇల్లందు :

మండలం మసివాగు గ్రామానికి చెందిన 30 కుటుంబాలు సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా మాస్ లైన్ పార్టీలో చేరడం విప్లవ పోరాటాలకు స్పూర్తిదాయకమని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య, ప్రజాపంథా రాష్ట్ర నాయకులు నాయిని రాజు అన్నారు. వారికి ఎర్ర కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. విప్లవ పార్టీ చీలికల అనంతరం వివిధ పార్టీలోకి వెళ్లిన వారు ప్రజాపంథా విప్లవ రాజకీయాలపై విశ్వాసం కలిగి తిరిగి రావడం ప్రజా ఉద్యమాలకు బలమైన విశ్వాసం కలిగిందని వారు అన్నారు. ఐదు దశాబ్దాల కాలంగా ప్రజలపక్షాననిలబడిదోపిడీ,పీడన,అన్యాయం, అక్రమాలపై పోరాడి పేద ప్రజలకు భూమిని పంచిపెట్టే క్రమంలో ఎందరో అమరులు అమరత్వం పొందిన చరిత్ర సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా పార్టీకి ఉందని వారి ఆశయాల వెలుగులో ప్రజలు ఎర్రజెండాను హత్తుకొని ‌ ప్రజా పోరాటాల నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యేందుకు వచ్చిన ప్రజలకు విప్లవ జేజేలు తెలిపారు. జరగబోయే గ్రామపంచాయతీ ఎన్నికలలో ప్రజాపంథా పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు.కిన్నెర నాగేశ్వరరావు,కిన్నెర బొర్రయ్య,బొర్ర రామ్మూర్తి, కిన్నెర తేజ,కిన్నెర శ్రీను,పూణెం ముత్తయ్య,బుర్ర యశోద, ఈసం ప్రసాద్ చిన్న శ్రీను ,దాట్ల కృష్ణ,కిన్నెర పగడయ్య, కిన్నెర సురేష్,పాముల శీను, పూణెం చంద్రకళ,కిన్నెర రామయ్య, కిన్నెర నిర్మల, కిన్నెర సాయమ్మ ,కిన్నెర స్వరూప, కిన్నెర సమ్మక్క, కిన్నెర సుక్కమ్మ, బొర్రచుక్కమ్మ,ఈసం భీమన్న ల తో పాటు మరి కొంతమంది ప్రజాపంథా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సుకు ఆవుల కిరణ్ అధ్యక్షత వహించగా యదళ్ళపల్లి సావిత్రి,సూర్ణపాక రామ్మూర్తి, మండల నాయకులు వాంకుడోత్ శంకర్, భానోత్ లస్కర్, ధారావత్ దేవా తదితరులు పాల్గొన్నారు.ఎండ్ న్యూస్

Scroll to Top