PS Telugu News
Epaper

అమలాపురంలో విద్యుత్ చార్జీల ప్రతిపాదనలపై ప్రజాభిప్రాయ సేకరణ!

📅 28 Jan 2026 ⏱️ 7:17 PM 📝 HOME
Listen to this article

పయ నించే జనవరి 28 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ​డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా

అమలాపురంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన విద్యుత్ చార్జీల ప్రతిపాదనలపై ఏపీఈఆర్‌సీ (APERC) ఆధ్వర్యంలో మంగళవారం బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. ​ ముఖ్య విశేషాలు:
ఈ కార్యక్రమంలో రైతులు, వినియోగదారులు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొని విద్యుత్ చార్జీల పెంపు, మార్పులపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. టీ. గోపాల కృష్ణ, ఎం. జమిలీ, టీ. నాగా భూషణం తదితరులు తమ వాణిని వినిపించారు.​ అధికారుల స్పందన:జిల్లా ఎస్ ఈ బి. రాజేశ్వరి, ఈ వై. విజయానంద్ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజల వినతులను స్వీకరించారు. ప్రజల అభిప్రాయాలను రికార్డు చేశామని, వాటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తుది నిర్ణయం తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

Scroll to Top