అయోధ్య రామ మందిరం వార్షికోత్సవ శోభయాత్రలో పాల్గొన్న పైడి ఎల్లారెడ్డి
ఈరోజు గాంధారి మండలం చద్మల్ తాండ గ్రామపంచాయతీలో 500 సంవత్సరాల భారతదేశ ప్రజలకు చిరకాల వాంఛ నెరవేర్చిన రోజు సందర్భంగా అయోధ్య రామ మందిరం వార్షికోత్సవ శుభ యాత్రలో సుమారు 5 వేల మంది భక్తులతో కలిసి పాల్గొన్నారు.చాద్మల్ తాండ యువకుల కోరిక మేరకు శివాజీ విగ్రహం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు, అనంతరం చద్మాల్ గ్రామం లో హనుమాన్ దేవాలయంలో స్వామి మాల ధరించినప్పడు స్వాములకు ఇబ్బందిగా ఉంది అని చెప్పగానే తక్షణమే సుమారు 5 లక్షల రూపాయలతో భక్తుల కొరకు షెడ్డు నిర్మిస్తను అని హామీ ఇచ్చారుగ్రామస్తులు పైడి ఎల్లారెడ్డి అభినందనలు తెలిపారు.
పైడి ఎల్లారెడ్డి తో పాటు గాంధారి బిజెపి మండల అధ్యక్షులు మధు సుధన్ బూత్ రమేష్ అధ్యక్షులు, జిల్లా నాయకులు గంగా రెడ్డి, సర్పంచ్ భాస్కర్ నాయక్ గ్రామ పెద్దలు ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.