అర్చక పురోహితులతో ” విశ్వహిందూపరిషత్ ” వారి సమావేశం…
పయ నించే సూర్యుడు జనవరి 22 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
ధర్మానికి జీవనాడులు మన దేవాలయములైతే, మన ధార్మిక వారసత్వాన్ని కాపాడుకోవడం మన కర్తవ్యం. మన దేవాలయాలను మనం రక్షించుకోవాలని, అందుకోసం విశ్వహిందూ పరిషత్ తరపున అర్చక పురోహితులు ప్రధాన పాత్ర వహించాలని కాలక్రమేణా స్థానిక ఆలయాల ధర్మకర్తల మండలి సభ్యులు కూడా ఈ విశ్వహిందూ పరిషత్తు ముఖ్య ఉద్దేశాన్ని స్థానికంగా ఆయా గ్రామాల్లో ఉన్న హిందూ బంధువులందరి మనసుల్లోకి చేరేలా ప్రయత్నం చేయాలని కోనసీమ జిల్లా ఆలమూరు మండలం జొన్నాడ గ్రామంలో వేంచేసి ఉన్న నవ జనార్ధన ఆలయాల్లో మూడవదైన జొన్నాడ గ్రామంలో జనార్ధన స్వామి వారి ఆలయంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది… ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా మహా మహోపాధ్యాయ ఆంధ్ర గీర్వాణి విద్యాపీఠం, సంస్కృతాంధ్ర పండితులు బ్రహ్మశ్రీ దోర్భల ప్రభాకర శర్మ గారు ( కొవ్వూరు వారు ), మరియు ఉత్తరాంధ్ర దక్షిణాంధ్ర మందిర అర్చక పురోహిత ప్రముఖ్ గారు శ్రీ శివశంకర్ గారు ( ఒంగోలు ) ఈ మీటింగ్ కి ప్రధాన సూత్రధారుడిగా మరియు చెముడు లంక వాస్తవ్యులు విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి దూలం గని రాజుగారు పాల్గొని, మరియు స్థానిక పురోహితులు బ్రహ్మశ్రీ ద్విభాష్యం రవి శర్మగారు, ఆలమూరు పరిసర అర్చక పురోహితులతో ఈ సభను నడిపించిరి….