అర్హులైన వారందరికి దశలవారీగా ఇందిరమ్మ ఇండ్లు.ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో : అర్హులైన వారందరికీ దశల వారిగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే పవార్ రామరావ్ తెలియజేశారు. కుంటాల మండల కేంద్రంలోని రైతు వేదికలో 73 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరి పత్రాలు అందజేసిన సందర్భంగా మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాల పాటు పేద ప్రజలకుv ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాక ఇబ్బందులు పడ్డారని, ముధోల్ నియోజకవర్గంలో మొదటి దశలో 3,500 ఇండ్లు మంజూరు చేయడం జరిగిందని, ప్రస్తుతం రెండో విడతలో మరో 2500 ఇండ్లు మంజూరు చేయనున్నట్లు చెప్పారు. ప్రభుత్వం గ్రామాల్లో రేకుల షెడ్లు,గుడిసెలో ఉన్న వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తుందని ప్రస్తుతం వారికి ఇండ్లు మంజూరు అవుతాయని చెప్పారు. ఎల్ టూ లిస్టులో ఉన్నవారిని ఎల్ వన్ లోకి మార్చుకోవచ్చని పంచాయతీ కార్యదర్శికి తమ వివరాలు అందజేయాలని చెప్పారు. ప్రతి పేద వాడు ఇల్లు నిర్మించుకునేలా తన వంతుగా కృషి చేస్తానని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఇందిరమ్మ ఇండ్లు మంజులవుతున్నాయన్న విషయాన్ని గుర్తు చేశారు. కార్యక్రమంలో అధికారులు, సర్పంచ్ లు, మాజీ ప్రజా ప్రతినిధులు, బిజెపి నాయకులు పాల్గొన్నారు.