అశ్వాపురం గ్రామపంచాయతీ కార్యాలయ స్థలం కొరకు వినతి
.వినతి పత్రం సమర్పించిన సర్పంచ్ సదర్ లాల్ మరియు ఉప సర్పంచ్ ప్రకాశ్ రావు
పయనించే సూర్యుడు, ఫిబ్రవరి,17, అశ్వాపురం
:మంగళ వారం అశ్వాపురం సర్పంచ్ సదర్ లాల్ మరియు ఉప సర్పంచ్ ప్రకాశ్ రావు లు స్తానిక శాసన సభ్యులు పాయం వెంకటేశ్వర్లు ని క్యాంపు కార్యాలయంలో కలిసి అశ్వాపురం గ్రామపంచాయతీ కార్యాలయం కొరకు స్థలం మంజూరు చేయాలని అభ్యర్థించారు.అశ్వాపురం గ్రామపంచాయతీ కార్యాలయం అప్పటి ఆంధ్రప్రదేశ్ హోమ్ శాఖ మంత్రివర్యులు జలగం వెంగళ రావు గారు పంతొమ్మి వందల డెబ్బై వ సంవత్సరం లో అనగా సుమారు యాభై ఐదు సంవత్సరాల క్రితం అప్పటి గ్రామ జనాభా ప్రకారం గ్రామ పంచాయతీని చిన్న చిన్న గదులతో కార్యాలయాన్ని నిర్మించడం జరిగింది. ఇప్పుడు అట్టి గ్రామపంచాయతీ భవనం శిథిలావస్థలో ఉండి అనేక సార్లు భవనాన్ని మరమత్తులు చేసిన కూడా స్లాబ్ పెచ్చులు రాలి పడుతున్నాయి. ప్రస్తుతం ఉన్న జనాభా ఇరవైవేల పైన కలిగి ఉన్నారు. సదరు అశ్వాపురం లో వివిధ ప్రభుత్వం స్థలాలు. ఆర్ అండ్ బి ప్రాంగణంనందు సుమారు మూడు ఎకరాలు స్థలం కలదు, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణం నందు సుమారు నాలుగు ఎకరాల స్థలం కలదు, వెటర్నరీ హాస్పిటల్ ప్రాంగణం నందు సుమారు అర ఎకరం స్థలం కలదు, ఆయుర్వేదిక్ హాస్పిటల్ ప్రాంగణం నందు సుమారు పది సెంట్ల స్థలం కలదు. కావున కొత్త కార్యాలయం నిర్మాణానికి కావలసిన స్థలాన్ని మంజూరు చేసేలా అధికారులను ఆదేశించమని కోరటం జరిగింది. దీనికి స్పందించిన శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు తప్పకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు, ఇందుకు సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ కృతజ్ఞతలు తెలియజేసినారు.