PS Telugu News
Epaper

అశ్వాపురం గ్రామ పంచాయతీ లో రోడ్ సేఫ్టీ గ్రామ సభ నిర్వహణ

📅 13 Apr 2026 ⏱️ 6:38 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు, ఏప్రిల్ 13, అశ్వాపురం:

సోమవారం నాడు అశ్వాపురం గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు రవాణా భద్రతపై గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి సర్పంచ్ బానోత్ సదర్ లాల్ మరియు ఉప సర్పంచ్ తుళ్ళూరి ప్రకాష్ రావు అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ బానోత్ సదర్ లాల్ మాట్లాడుతూ నేటి బాలలే రేపటి భావిభారత పౌరులని విద్యార్థి దశలోనే పిల్లలను మంచి మార్గంలో నడిపించాలని మన చుట్టూ జరుగుతున్నటువంటి కొన్ని అనైతిక కార్యక్రమాలపై విద్యార్థులకు అవగాహన కల్పించి యువత డ్రగ్స్ గంజాయి లాంటి మాదకద్రవ్యాలకు అలవాటు పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిదీ అని అన్నారు. ముఖ్యంగా 15 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు గల యువత రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. యువత ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని బైక్ నడిపేటప్పుడు వేగం కంటే ప్రాణం ముఖ్యమని సూచించారు.తదుపరి ఎస్సై ఈ. రాజేష్ రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ, హెల్మెట్ ధరించడం, సీటు బెల్ట్ వినియోగం, వేగ నియంత్రణ వంటి ముఖ్యమైన సూచనలు అందించారు.అలాగే ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ లు పూణెం వెంకటేశ్వర రావు మరియు గూగులోత్ సుశీల విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన పెంచే విధంగా తమ సలహాలు, సూచనలు తెలియజేశారు.అనంతరం అశ్వాపురం గ్రామపంచాయతీ లో రోడ్డు భద్రత నియంత్రణ కమిటీ ఎన్నుకోవడం జరిగింది.చైర్మన్ గా బానోత్ సదర్ లాల్ (సర్పంచ్) సభ్యులు భూక్యా భారతి (ఆశ)
సండ్రా విజయ (అంగన్వాడీ టీచర్) యోగితవేణి (హెచ్.ఎం), గద్దల చైతన్య (వి.వో.ఏ), మోర్వనేని చంద్రకళ (వార్డు సభ్యులు), వేములపల్లి హసిత (వార్డు సభ్యులు), స వలం అనిల్ కుమార్ (వార్డు సభ్యులు), కందిమళ్ళ శ్రీకాంత్ (కార్యదర్శి) ఈ యొక్క కమిటీ లో తొమ్మిది మంది సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కందిమళ్ళ శ్రీకాంత్, వార్డు సభ్యులు సవలం అనిల్ కుమార్, కనతల ధనలక్ష్మీ, జరుపుల కౌసల్య, కుర్సం అనసూర్య ,కోర్స ముత్తమ్మ,అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు, గ్రామ ప్రజలు మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

Scroll to Top