PS Telugu News
Epaper

అశ్వాపురం రైల్వే స్టేషన్‌లో రైలు నిలుపుదల కల్పించాలని ఎమ్మెల్యే పాయం కి వినతి పత్రం.

📅 22 Apr 2026 ⏱️ 2:43 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

వినతి పత్రం సమర్పించిన సర్పంచ్ బానోత్ సదర్ లాల్.

పయనించే సూర్యుడు, ఏప్రిల్ 22,అశ్వాపురం:

అశ్వాపురం గ్రామ ప్రజల దశాబ్దాల కల అయిన రైల్వే స్టేషన్ కనెక్టివిటీ మరియు రైళ్ల నిలుపుదల అంశంపై అశ్వాపురం సర్పంచ్ బానోత్ సదర్ లాల్ పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు కి ప్రత్యేక విన్నపం చేశారు. ఈ సందర్భంగా వారు గత పదేళ్లుగా సాగిన కృషిని, ప్రస్తుత అవసరాలను వివరించారు.అశ్వాపురం గ్రామం నుండి వెళ్లిన సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న రైల్వే స్టేషన్‌కు సరైన మార్గం లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో, మాజీ సర్పంచ్ బానోత్ శారద, 2013 నుండి నిరంతరం శ్రమించారు. గత ప్రభుత్వ ప్రజా ప్రతినిధుల సహకారంతో సుమారు 2 కోట్ల రూపాయల వ్యయంతో 5 కల్వర్టులు, 3 లో-లెవెల్ వంతెనలతో కూడిన మెటల్ రోడ్డు పనులు అప్పటి ప్రజా ప్రతినిధులు సహకారంతో విజయవంతంగా పూర్తయ్యాయి.అశ్వాపురం చుట్టుపక్కల అనేక గిరిజన గ్రామాలు ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడి ప్రజలు, మధ్యతరగతి కుటుంబాలు మరియు హెవీ వాటర్ ప్లాంట్ ఉద్యోగులు రైలు ఎక్కాలంటే రాను పోను 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న మణుగూరు స్టేషన్‌కు వెళ్లాల్సి వస్తోంది. రాత్రి సమయాల్లో ప్రైవేటు ఆటోలను ఆశ్రయించడం వల్ల సామాన్య ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం పడుతోంది. బస్సు చార్జీల కంటే రైలు ప్రయాణం చౌకగా, సుఖమయంగా ఉన్నప్పటికీ, అశ్వాపురం స్టేషన్‌లో రైలు ఆగకపోవడం వల్ల ఆ సౌకర్యాన్ని పొందలేకపోతున్నారు. అశ్వాపురం రైల్వే స్టేషన్ వద్ద రైళ్లు ఆగే విధంగా చర్యలు తీసుకోవాలని, దీనివల్ల వేలాది మంది గిరిజన ప్రజలకు, పారిశ్రామిక ప్రాంత కార్మికులకు ఎంతో మేలు జరుగుతుందని సర్పంచ్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఈ ప్రాంత అభివృద్ధికి, సామాన్యుల సౌకర్యార్థం అశ్వాపురం రైల్వే స్టేషన్ వద్ద రైలు నిలుపుదల అత్యంత ఆవశ్యకం. ఈ విషయంలో ఏం పి. పోరిక బలరామ్ నాయక్ మరియు సికింద్రాబాద్ రైల్వే జనరల్ మేనేజర్ కి, కరోనా సమయంలో రద్దయిన రైళ్లను ప్రజల సౌకర్యార్థం తిరిగి పునరుద్ధరించాలని సర్పంచ్ మరియు స్థానిక ప్రజల తరపున పై అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తారని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.ఈ రోడ్డు నిర్మాణానికి సహకరించిన గత ప్రభుత్వ ప్రజాప్రతినిధులకు మరియు భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారులు ఈ సందర్భంగా సర్పంచ్ కృతజ్ఞతలు తెలియజేశారు.

Scroll to Top