SIR గురించి అపోహలను నమ్మవద్దు బీజేపీ భీంగల్ మండల అధ్యక్షులు అరె రవీందర్.

July 6, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడుD.6.7.2026 నిజాంబాద్ జిల్లా స్టాపర్ టి కే గంగాధర్.బాల్కొండ నియోజకవర్గంలో భీంగల్ మండలంలో
బాచన్‌పల్లి గ్రామంలో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న ఎన్యూమరేషన్ (ఓటరు గణన) ఫారమ్‌ల పంపిణీ మరియు సేకరణ ప్రక్రియను బీజేపీ భీంగల్ మండల అధ్యక్షులు అరె రవీందర్ స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, భారత ఎన్నికల సంఘం చేపట్టిన SIR కార్యక్రమం ఓటరు జాబితాను మరింత పారదర్శకంగా, ఖచ్చితంగా రూపొందించేందుకు ఉద్దేశించిన ప్రక్రియ అని తెలిపారు. ఈ కార్యక్రమంపై కొందరు ఉద్దేశపూర్వకంగా ప్రజల్లో అపోహలు, అనుమానాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని, అలాంటి అసత్య ప్రచారాలను ప్రజలు ఏమాత్రం నమ్మవద్దని కోరారు.అర్హులైన ప్రతి ఓటరు ఎన్యూమరేషన్ ఫారమ్‌ను తప్పనిసరిగా స్వీకరించి, అవసరమైన వివరాలు మరియు పత్రాలతో నింపి సంబంధిత బూత్ లెవల్ అధికారి (BLO)కి సమర్పించాలని సూచించారు. ఓటరు జాబితాలో ప్రతి అర్హుడి పేరు ఉండటం ప్రజాస్వామ్య బలోపేతానికి ఎంతో అవసరమని అన్నారు.
ఎన్నికల సంఘం జారీ చేసే అధికారిక మార్గదర్శకాలను మాత్రమే ప్రజలు అనుసరించాలని, సోషల్ మీడియాలో వచ్చే పుకార్లు, తప్పుడు ప్రచారాలను విశ్వసించవద్దని విజ్ఞప్తి చేశారు. ఏవైనా సందేహాలు ఉంటే సంబంధిత ఎన్నికల అధికారులు లేదా BLOలను సంప్రదించి సరైన సమాచారం తెలుసుకోవాలని సూచించారు.ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడంలో ప్రతి ఓటరు బాధ్యతాయుతంగా వ్యవహరించి SIR ప్రక్రియలో చురుకుగా పాల్గొనాలని అరె రవీందర్ విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో BJYM మండల అధ్యక్షులు శెట్టి ప్రేమ్ చంద్,బీజేపీ సీనియర్ నాయకులు శెట్టి లక్ష్మణ్,నర్సింగ్,వన్నెల వంశీ,సాయి చరణ్,భాగ్యరాజ్ నాయకులు,కార్యకర్తలు, పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper