తంగళ్ళపల్లి గ్రామపంచాయతీ ఎన్నికల్లో మోర లక్ష్మీరాజ్యం ఘన విజయం
పయనించే సూర్యుడు, డిసెంబర్ 15( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి )చెరుకుపల్లి రాకేష్ రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన మోర లక్ష్మీరాజ్యం ఘన విజయం సాధించారు. నిన్న జరిగిన ఎన్నికల్లో మొత్తం 1612 ఓట్లు సాధించి, ప్రత్యర్థిపై 31 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.ఈ విజయంతో తంగళ్ళపల్లి గ్రామం ఉత్సవ వాతావరణాన్ని సంతరించుకుంది. గ్రామంలో భారీ ఎత్తున సంబరాలు నిర్వహించగా, ప్రజలు ఆనందోత్సాహాలతో పాల్గొన్నారు. […]




