PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్

శేష వస్త్రాల లావాదేవీల్లో అక్రమాలు – విచారణలో బయటపడిన అంశాలు

పయనించే సూర్యుడు న్యూస్ : తిరుమల స్వామివారి పట్టు వస్త్రాల కొనుగోళ్లలో పెద్దఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని టీటీడీ ఓ అంచనాకొచ్చింది. స్వామికి వాడే పట్టు వస్త్రాలతో పాటు.. స్వామి దర్శనానికి వచ్చే ప్రత్యేక అతిథులు, దాతలు, VIPలకు ఆశీర్వచనం అనంతరం కప్పే పట్టు శాలువాల కొనుగోళ్లలో భారీ అవినీతి బయటికొచ్చింది. 2010 నుంచి పట్టు పేరుతో పాలిస్టర్ వస్త్రాలను టీటీడీకి అంటగడుతూ.. కోట్లు కొల్లగొడుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అసలు అది పట్టే కాదనే అంశం రెండు నెలల […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రుద్రూర్ గ్రామ సర్పంచ్ కు ఘన సన్మానం..

రుద్రూర్, డిసెంబర్ 13 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) రుద్రూర్ గ్రామ సర్పంచ్ గా గెలుపొందిన ఇందూరు సునీత-ఇందూరు చంద్రశేఖర్ దంపతులు శనివారం శ్రీ విఠలేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వారి విజయాన్ని పురస్కరించుకుని ఆలయ కమిటీ, శ్రీ సార్వజనిక్ గణేష్ మండలి ఆధ్వర్యంలో వారిని ఘనంగా సన్మానించారు. సర్పంచ్ దంపతులకు శాలువా, పూలమాలలతో శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని కమిటీ సభ్యులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అంబం గ్రామ సర్పంచ్ కు ఘన సన్మానం

…రుద్రూర్, డిసెంబర్ 13 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) : రుద్రూర్ మండలంలోని అంబం బీజేపీ పార్టీ గ్రామ సర్పంచ్ గా కుర్లెపు గంగాధర్ గెలుపొందడంతో,రుద్రూర్ మండల బీజేపీ పార్టీ కార్యాలయంలో శనివారం సర్పంచ్ కుర్లెపు గంగాధర్ కు రుద్రూర్ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ శుభాకాంక్షలు తెలియజేస్తూ శాలువా, పూలమాలలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ ప్రశాంత్ గౌడ్, నియోజకవర్గ సీనియర్ నాయకులు ప్రకాష్ పటేల్, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

ఏపీ రాజకీయాల్లో విషాద వార్త… మాజీ ఎంపీ కుసుమ కృష్ణమూర్తి కన్నుమూత

పయనించే సూర్యుడు న్యూస్ :మాజీ ఎంపీ కుసుమ కృష్ణమూర్తి గుండెపోటుతో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయనను ఢిల్లీలోని ఓ ఆస్పత్రికి తరలించారు. కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన శనివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో గుండెపోటుతో చనిపోయారు. ఆయన మృతి ఏపీ రాజకీయాల్లో విషాదం నింపింది. అయితే, కాంగ్రెస్ పార్టీ తరఫున అమలాపురం లోక్ సభ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎంపీగా గెలిచారు. అదే విధంగా 6, 7, 9వ లోక్

ఆంధ్రప్రదేశ్

పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలన్నదే నా కల— భారత అంధ మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ దీపిక వ్యాఖ్యలు

పయనించే సూర్యుడు న్యూస్ :ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్‌ను చూడటమే నా కల.. ఇలాంటి లీడర్ మన దేశానికి ఉండాలి.. అంటూ భారత అంధ మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ దీపిక పేర్కొన్నారు. ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత మహిళల అంధుల క్రికెట్ జట్టుతో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో క్రికెటర్లు, శిక్షకులు, సహాయక సిబ్బందితో పవన్ కల్యాణ్ ఆప్యాయంగా మాట్లాడారు.. ప్రపంచ కప్ సాధించిన

Scroll to Top