యువత నైపుణ్యాభివృద్ధికి మైలురాయిగా నిలుస్తున్న ఏటిసి- జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్.
పయనించే సూర్యుడు, ఆగస్టు 22, బూర్గంపాడు మండల రిపోర్టర్ పోతుగంటి రామ్ ప్రసాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని ఐటీఐ కృష్ణసాగర్ వద్ద ఏర్పాటు చేసిన అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్( ఏటిపి) ను జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ గురువారం పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ ఆధునిక పరికరాలు శిక్షణా ల్యాబొరేటరీలు వర్క్‌షాప్ విభాగాలు మరియు తరగతి గదులను పరిశీలించారు. తరగతి గదిలో ఉన్న విద్యార్థులతో కలెక్టర్ ముచ్చటిస్తూ వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు . […]




