PS Telugu News
Epaper

ఆగాపే ఆశ్రమంలో అన్నదానం

📅 17 Jan 2026 ⏱️ 6:25 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 17 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి

యాడికి మండలం, కమలపాడు రోడ్డు, రాఘవేంద్ర కాలనీలో ఉన్న అగాపే ఆశ్రమంలో పోలూరు నారాయణస్వామి, భార్య లక్ష్మీదేవి, కుమార్తె ఇందుమతి వీరి కుటుంబము ఆశ్రమంలోని నిరాశ్రయులందరికీ అన్నదానం ఏర్పాటు చేశారు. కుమార్తె ఇందుమతికి ఉద్యోగము రావడం ద్వారా సంతోషించి, కృతజ్ఞతగా భోజనాలు సిద్ధపరచుకొని అగాపే ఆశ్రమంలో కుటుంబమంతా కలిసి అన్నదానం చేశారు. వీరితోపాటు నారాయణస్వామి తల్లి నాగలక్ష్మి, తమ్ముడు భాస్కర్, మరదలు లలిత, బంధుమిత్రులు పాల్గొన్నారు. ఇందు నిమిత్తమై ఆశ్రమం ఫౌండర్ బత్తల ప్రసాద్, ఆశ్రమంలోని వారంతా వారి కుటుంబానికి అభినందనలు తెలిపారు.

Scroll to Top