ఆత్మకూరులో స్కూల్ వాహనాలను తనిఖీ చేసిన బ్రేక్ ఇన్స్పెక్టర్ రాములు
” “పయనించే సూర్యుడు డిసెంబర్ 3 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
వాహనాలను ఎప్పటికప్పుడు పరిశీలించుకోండి.స్కూల్ వాహన యజమానులకు ఆర్టీవో రాములు సూచనశ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు డివిజనల్ బ్రేక్ ఇన్స్పెక్టర్ రాములు తన పరిధిలోని వివిధ మండలాల ప్రైవేట్ స్కూల్స్ వాహనాలను ప్రతిరోజు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇదే క్రమంలో నేడు ఆత్మకూరులోని ఏ ఎస్ ఆర్ డిగ్రీ కళాశాల వాహనాలను తనిఖీ నిర్వహించారు. వాహన ఫిట్నెస్ డ్రైవర్ల లైసెన్సులు వాహన అనుమతులను క్షుణ్ణంగా పరిశీలించారు. స్కూల్ వాహనాలను నడుపుతున్న డ్రైవర్ల లైసెన్సులను వారి వృత్తి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు.వాహన స్థితిని వాహనాలను తనిఖీ నిర్వహించి బస్సులోని ఇంజన్ ఎమర్జెన్సీ డోర్ ఇతర సదుపాయాలను పరిశీలించారు. అనంతరం స్కూల్ వాహనాల పట్ల ప్రభుత్వం నిర్దేశించిన పలు నియమాలను డ్రైవర్ . యాజమాన్యాల వివరించి తగు సూచనలు చేశారు. వాడిన వాడకపోయినా ప్రతిరోజు ఎమర్జెన్సీ డోర్లు ఓపెన్ చేస్తూ ఉండాలని అలాగే స్కూల్ వాహనాలు ఎక్కుతున్న విద్యార్థులకు వాహన స్థితిని అవగాహన కల్పించాలని గ్రామాల నుండి తమ బిడ్డల విద్యా భవిష్యత్తు కోసం వారి తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో తమ బిడ్డలను కళాశాలకు పంపుతున్న దృష్ట్యా విద్యార్థులను అతి జాగ్రత్తగా వారి గమ్య స్థానాలకు చేర్చాలని డ్రైవర్లకు సూచించారు. అనంతరం ఆత్మకూరు ఆర్టీవో రాములు మాట్లాడుతూ ప్రస్తుతం తన పరిధిలోని పలు స్కూల్స్ కళాశాలల విద్యార్థులను తరలించే వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించి వారికి తగు సూచనలు చేస్తున్నామని మరో రెండు రోజులలో వారం రోజులపాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా విజయవాడ నుండి ప్రత్యేక బృందం అన్ని స్కూల్ వాహనాలను ఆకస్మిక తనిఖీ నిర్వహించి వాటి స్థితిని పరిశీలిస్తారని అటువంటి సమయంలో ఏవైనా పొరపాట్లు ఉన్నాయెడల వారిపై కఠిన చర్యలు తీసుకోబడును అని తెలిపారు. అనంతరం విద్యార్థులకు వాహనంలో ప్రయాణించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని వాహనం నడుపుతున్న డ్రైవర్ను గమనించాలని ఏవైనా ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తినప్పుడు వాహనాన్ని నిలిపివేసి తల్లిదండ్రులకు ,స్కూలు యాజమాన్యానికి, పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు ఆయన వెంట సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
